సనాతన ధర్మంలో ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఏవైనా శుభ కార్యాలు చేసిన, ఇంటర్వ్యూ అయినా లేదా మొదటి రోజు పని అయినా గృహప్రవేశమైన వివాహ వార్షికోత్సవమైన ప్రతిపని సనతన ధర్మంలో పుజతోనే మొదలవుతుంది.
కానీ ఈ పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.అలాంటి పొరపాట్లను మనం గమనించిన అవేవో చిన్నవే అని వాటిని మర్చిపోతూ ఉంటాం.
ఎందుకంటే పూజ చేసే సమయంలో కొన్ని వస్తువులు చేతి నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి.అయితే పూజ వస్తువులు చేతి నుంచి పడిపోతే అశుభమని మన శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు.
కానీ మనం పూజ చేస్తున్న సమయంలో ఏ వస్తువు చేతి నుంచి పడిపోతే అ శుభంగా భావిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ సమయంలో ప్రసాదం చాలా సార్లు మన చేతి నుంచి లేదా ప్లేట్ నుంచి కింద పడిపోతూ ఉంటుంది.
ఇది శాస్త్రంలో అశుభంగా భావిస్తారు.మీకు ఏదైనా ఆటంకం ఏర్పడుతున్నప్పుడు ఇలా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.
అటువంటి పరిస్థితులలో ప్రసాదం పడిపోయినప్పుడు వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై కొంచెం పూయాలి.
అందుకోసమే మీరు చేతితో ప్రసాదాన్ని పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.ఇంకా చెప్పాలంటే దేవుని పూజించేటప్పుడు దీపం క్రింద పడడం ఆ శుభంగా భక్తులు భావిస్తూ ఉంటారు.మన జీవితంలో ఏదో ముప్పు జరుగుతుంది అని సూచనగా ఇలా జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.
ఇలా పొరపాటు జరిగితే బాధపడాల్సిన అవసరం లేదు.దేవునికి దండం పెట్టి కింద పడిపోయిన దీపాన్ని తీసి మళ్లీ ప్రతిష్టించడం చేయాలి.
కానీ కొన్నిసార్లు కుంకుమ నేల మీద పడుతుంది.అంటే కుటుంబం లేదా భర్తకు ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉందని నమ్ముతారు.కానీ కుంకుమ కింద పడితే దాన్ని చీపురుతో ఉండకూడదు.దగ్గరికి తీసి పారుతున్న నీటిలో వేయడం మంచిది.