ఏలూరు: మంత్రి తానేటి వనిత కామెంట్స్.ఖచ్చితంగా రైతుల దెబ్బతిన్న పంటను కొనుగోలు చేస్తాం.ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు.రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతకు, ఆ పార్టీకి లేదు.ప్రతిపక్ష నేతకు ఎప్పటికీ అధికారం రాదన్న ప్రస్టేషన్ తోనే ముఖ్యమంత్రిపై నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా పంట సీజన్ ముగిసేలోపు నష్టపరిహారం అందించారా.?
ఈ సీజన్ ముగిసేలోపే రైతులకు అందాల్సిన పరిహారాన్ని, ఆర్థిక సహాయాన్ని జగనన్న ప్రభుత్వం అందిస్తోంది.మాటి మాటికీ సైకో అంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ముసలి సైకో ఎవరో.పిల్ల సైకో ఎవరో.
ప్రజలందరికీ తెలుసు.అకాల వర్షాల కారణంగా రైతుల బాధలను ఆసరాగా తీసుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబుని, లోకేష్ ని చూసి జనం ఛీ కొడుతున్నారు.
వర్షాలకు దెబ్బ తిన్న ధాన్యం, ప్రతి పంటను ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది… చంద్రబాబు నాయుడు హాయాంలో మిల్లర్లు, దళారులతో కలిసి రైతులను దోచుకున్నారు.