వేట్టయన్ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు( Rajinikanth ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ( Vettaiyan ) ఈరోజు థియేటర్లలో విడుదలైంది.

 Rajinikanth Vettaiyan Movie Twitter Review Details, Rajinikanth, Vettaiyan Movie-TeluguStop.com

పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.రజనీకాంత్ అభిమానులకు విందు భోజనంలా ఈ సినిమా ఉందని సమాచారం అందుతోంది.

సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలోని మొదటి 20 నిమిషాల సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని భోగట్టా.

ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సైతం రేసీ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.సినిమాకు ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయని సమాచారం అందుతోంది.

అనిరుధ్( Anirudh ) బీజీఎం, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది.ఫహద్ ఫాజిల్( Fahadh Faasil ) పాత్ర సరదాగా ఉండగా అమితాబ్ పాత్ర హుందాగా ఉంది.

Telugu Anirudh, Tj Gnanavel, Fahadh Faasil, Rajinikanth, Vettaiyan-Movie

సినిమాలోని ప్రధాన పాత్రల నటులు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.మనసిల్లాయో సాంగ్ స్క్రీన్ పై కూడా బాగుంది.అనిరుధ్ తన సంగీతం, బీజీఎంతో సినిమాకు ప్రాణం పోశారు.సెకండాఫ్ లో కొన్ని లోపాలు ఉన్నా రజనీ ఖాతాలో మరో హిట్ చేరినట్టేనని చెప్పవచ్చు.అంచనాలు లేకుండా చూస్తే మాత్రం ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Anirudh, Tj Gnanavel, Fahadh Faasil, Rajinikanth, Vettaiyan-Movie

జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్( TJ Gnanavel ) ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే బుకింగ్స్ బాగానే ఉన్నాయి.దసరా పండుగకు ఇప్పటికే దేవర సినిమాను చూసిన ప్రేక్షకులకు వేట్టయన్ రూపంలో మరో ఆప్షన్ దొరికింది.500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో దేవర ఫుల్ రన్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.యావరేజ్ టాక్ తో కూడా జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube