హిందువులు జరుపుకునే పండుగలలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి( Sankranti Festival ) అని చెప్పవచ్చు.సంక్రాంతి భోగితో మొదలై కనుమ పండుగతో ముగిస్తుంది.
మూడు రోజులపాటు సాగే ఈ పండుగ వెనుక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.సాధారణంగా సంక్రాంతి పండుగ జనవరి నెలలోనే( January ) ఎందుకు వస్తుంది.
ప్రతి సంవత్సరం సంక్రాంతి ను జనవరి నెలలోనే జరుపుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.అయితే జనవరి నెలలో శీతాకాలం మొదలవుతుంది.
అప్పుడు చలి విపరీతంగా పెరిగిపోతుంది.
కాబట్టి మనుషులతో పాటు అన్ని జీవరాసులలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది.
కాబట్టి సంక్రాంతి పండుగ నెల ప్రారంభమైన వెంటనే బెల్లంతో కూడిన పిండి వంటలు చేస్తారు.ఇక బెల్లంలో( Jaggery ) ఐరన్, స్థూల, సూక్ష్మ పోషకాలు ఉంటాయి.
ఇవి వ్యాధి నిరోధకతను పెంపొందించడంలో సహాయపడతాయి.ఇక భోగి పండుగ( Bhogi ) రోజు వేసే భోగిమంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు కూడా వాడతారు.
దీని వలన గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి.ఇక సంక్రాంతి ముగ్గులు( Sankranti Rangoli ) వేసే పసుపు కుంకుమ అలాగే ఆవు పేడతో పెట్టే గొబ్బెమ్మలు వీటన్నిటి కారణంగా ఇంట్లోకి సూక్ష్మ జీవులు రాకుండా ఉంటాయి.

ఇక కనుమ రోజు పశువులను పూజించడం ఎప్పటినుండో ఆనివాయితీగా వస్తోంది.ఇక వ్యవసాయ ఆధారిత దేశమైన మనదేశంలో అయితే ఎప్పటినుంచో పశువులు రైతులకు( Farmers ) సహాయపడుతూనే ఉన్నాయి.అలాంటి పశువులకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని రక్షించడం మన బాధ్యత అని తెలియజేస్తుంది.కనుమ పండుగ( Kanuma ) రోజు పశువులకు పసుపు కుంకుమ, సున్నం ఉపయోగించి రంగులు వేస్తారు.
ఇలా చేయడం వలన అవి చలికాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి.

అంతేకాకుండా ఈరోజు పెరిగిన సాంకేతికతతో మనం తెలుసుకుంటున్న విషయాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలాంటి పరికరాలు లేకుండానే మన పూర్వీకులు కనుగొన్నారు.అయితే అవి అందరూ ఆచరించాలి అన్న ఉద్దేశంతోనే వాటిని సాంప్రదాయాల పేరుతో ప్రజల్లోకి తీసుకువస్తున్నారు.కానీ నేడు మాత్రం మనలో చాలామంది విదేశీ సంస్కృతి మోజులో పడిపోతున్నాం.
వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నాం.ఇకనైనా మన సంస్కృతి గురించి తెలుసుకొని విదేశీ సంస్కృతిని గౌరవిస్తూ మన సంస్కృతిని ప్రేమిస్తూ ఉండాలి.
DEVOTIONAL