అక్టోబర్ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సహా శని గ్రహం యొక్క స్థానం మరియు కదలికలు మారబోతున్నాయి.అక్టోబర్ నెలలో, 2022 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం జరగబోతోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ నెలలో చాల ఆసక్తికర సంఘటనలు జరిగే అవకాశం ఉంది.ఈ గ్రహాల మార్పు వల్ల వాతావరణం ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు మొత్తం 12 ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.అక్టోబర్ నెలలో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2022 సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25 మధ్యాహ్నం 02.29 నుండి సాయంత్రం 06.32 గంటల వరకు ఉంటుంది.అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశం లేదు.అందువల్ల భారతదేశంపై ఇది ఎటువంటి ప్రత్యేక ప్రభావాన్ని చూపలేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అక్టోబర్ 25న సూర్య గ్రహణం, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే చాలా నష్టపోతారు.

సూర్యగ్రహణం వల్ల వృషభ రాశి వారి జీవితంపై మరింత ప్రభావం చూపుతుంది.ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.సూర్యగ్రహణం ప్రభావం మిథునరాశి వారి జీవితంపై కూడా ఎక్కువగా ఉంటుంది.మీరు ఏదైనా పని కోసం కష్టపడవలసి ఉంటుంది, అప్పుడే మీరు విజయం సాధిస్తారు.ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.
సూర్యగ్రహణం వల్ల కన్యా రాశి వారి జీవితం కూడా బాగా దెబ్బతినే అవకాశం ఉంది.ఈ రాశి వారు తమ ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఎందుకంటే అనవసర ఖర్చులు పెరుగుతాయి.దీనితో పాటు, మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
సూర్యగ్రహణం వల్ల వృశ్చిక రాశివారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది.మీరు డబ్బు దొరకని కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు.
అలాగే, పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.