డార్క్ స్పాట్స్‌ను మాయం చేసి ముఖాన్ని సూప‌ర్ గ్లోయింగ్‌గా మార్చే క్రీమ్ మీకోసం!

ఎండల ప్రభావం, హార్మోన్ చేంజెస్, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే మేకప్ ఉత్పత్తులను వాడటం, పిగ్మెంటేషన్ తదితర కారణాల వల్ల ముఖ చర్మం పై డార్క్‌ స్పాట్స్ ఏర్పడుతుంటాయి.ఇవి చూపరులకు అసహ్యంగా కనిపించడమే కాదు అందాన్ని సైతం తీవ్రంగా దెబ్బ తీస్తాయి.

 A Cream That Remove Dark Spots And Makes The Face Super Glowing Is For You! Dark-TeluguStop.com

దీంతో డార్క్ స్పాట్స్ ను వదిలించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను వాడారంటే డార్క్ స్పాట్స్ చాలా త్వరగా మాయం అవ్వడమే కాదు ముఖ చర్మం గ్లోయింగ్ గా సైతం మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక క్యారెట్ ను తీసుకుని వాటర్‌లో కడిగి సన్నగా తురిమి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి.

అలాగే అందులో క్యారెట్ తురుము, టమాటో ముక్కలను వేసి చిన్న మంటపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసి పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను మాత్రం స‌పరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి.

అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టుకున్న టమాటో-క్యారెట్ ఆయిల్ ను వేసుకోవాలి.దాంతో పాటు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వ‌న్‌ విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే డార్క్ స్పాట్స్ ను నివారించే క్రీమ్ సిద్ధం అయినట్టే.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ముఖానికి అప్లై చేసి పడుకోవాలి.ప్రతిరోజు ఈ హోం మేడ్ క్రీమ్ ను కనుక వాడితే డార్క్ స్పాట్స్ దూరమై చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube