సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో అప్పులు ఉండడం సర్వసాధారణం.ఏదో ఒక అవసరం నిమిత్తం డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా ఇతరులతో అప్పు తీసుకుంటూ ఉంటాము.
ఇలా ఒకరి దగ్గర చేసిన అప్పులు తీర్చేలోగా మరొకసారి అప్పు చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి.ఇలా కొందరు నిత్యం అప్పులతో ఎంతో సతమతమవుతూ ఉంటారు.
ఈ విధంగా ఒక అప్పు తీర్చేలోగా మరొక అప్పు చేస్తూ ఉంటే ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు.
ఇలా నిత్యం అప్పుల బాధతో బాధపడేవారు ముఖ్యంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి.
ప్రతి రోజు ఉదయమే శుభ్రంగా స్నానం చేసి అమ్మవారికి తామర గింజల దండతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదవాలి.ఇలా తామర గింజలు దండతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది.
అలాగే 24 గంటల పాటు అమ్మవారి ఎదుట దీపం వెలుగుతూ ఉండాలి.అయితే ఈ దీపాన్ని మట్టి లేదా వెండి ప్రమిదలో వెలిగించాలి.

అదేవిధంగా మన ఇంటి తూర్పు ముఖంగా తులసి కోట నుంచి ప్రతిరోజు ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి పూజ చేసే అనంతరం అమ్మవారిని ప్రార్థించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది.అలాగే అమ్మవారిని 12 రోజుల పాటు 12 శ్లోకాలతో పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.అలాగే మరింత మెరుగైన ఫలితాలు రావాలంటే ప్రతి శుక్రవారం మట్టి ప్రమిదలలో తామర గింజలు వేసి దీపారాధన చేయటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.