Beauty Tips : కాళ్లు, చేతుల నల్లదనం పోగొట్టే టిప్స్

ఎంత తెల్లగా ఉండే వాళ్లైనా సరే ఎండలో తిరిగితే కాళ్లూ, చేతులు నల్లగా మారిపోతుంటాయి.అయితే కొన్ని చిట్కాలతో నల్లగా ఉన్న కాళ్లూ చేతులను తెల్లగా మార్చేయొచ్చు.

 Simple Home Remedies To Get Fair Hands And Legs, Hands,legs,glowing Skin,lemon,c-TeluguStop.com

సాధారణంగా శరీరమంతా ఒక కలర్ లో ఉంటే కాళ్లూ చేతులు వేరే కలర్ లో ఉంటాయి.కొందరిలో శరీర భాగాలన్నీ తెల్లగా ఉంటే కాళ్లూ చేతులు మాత్రం కాస్త నలుపు రంగులో ఉంటాయి.

దీనికి ఒక కారణం మెలనిన్ అనే పదార్థం.ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి రక్షించేందుకు మన చర్మం మెలనిన్ ను రిలీజ్ చేస్తుంది.

దీంతో చర్మం కాస్త ముదురు రంగులోకి మారుతుంది.ముఖ్యంగా మన శరీర భాగాల్లో కాళ్లూ చేతులు మాత్రమే కాస్త నలుపురంగులో ఉంటాయి.

అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే అవి తెల్లగా మెరిసిపోతాయి.

Telugu Tips, Cucumber, Curd, Skin, Legs, Lemon, Potato, Tomato-Telugu Health

ప్రతి వంటగదిలో నిమ్మకాయ ఖచ్చితంగా ఉంటుంది.అయితే నిమ్మ నల్లగా ఉండే ప్లేసెస్ ను తెల్లగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది.ఎందుకంటే దీనిలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి.

ఇందుకోసం నిమ్మరసాన్ని పిండి కొన్ని చుక్కల్ని చేతులకు, కాళ్లకు రాయండి.దీంతో మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
నల్లని చర్మాన్ని తెల్లగా చేయడానికి పెరుగు దివ్య ఔషదంలా పనిచేస్తుంది.ఎందుకంటే దీనిలోని లాక్టిక్ యాసిడ్ బ్లీచింగ్ ఏంజెంట్ లా పనిచేస్తుంది.ఇందుకోసం ఒక టీ స్పూన్ పెరుగును తీసుకుని నల్లగా ఉండే ప్లేస్ లో అప్లై చేయండి.ఇది పూర్తిగా ఆరిన తర్వాత దానిపై కొన్ని నీళ్లు జల్లుతూ మసాజ్ చేస్తూ శుభ్రం చేయండి.

Telugu Tips, Cucumber, Curd, Skin, Legs, Lemon, Potato, Tomato-Telugu Health

కీరదోస కూడా చాలా ఉపయోగపడుతుంది.చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతో సహాయపడతాయి.వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.ఇది చర్మాన్ని మదురురంగులోకి మార్చే మెననిన్ ను కంట్రోల్ చేస్తుంది.ఇందుకోసం దోసకాయను మెత్తగా గ్రైండ్ చేసుకోండి.దాన్ని కాళ్లకు, చేతులకు అప్లై చేయండి.

ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి.ఆ తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోండి.

తరచుగా దోసకాయను ఇలా ఉపయోగిస్తే.నల్లగా ఉండే ప్లేసెస్ తెల్లగా మారుతాయి.

Telugu Tips, Cucumber, Curd, Skin, Legs, Lemon, Potato, Tomato-Telugu Health

నారింజలో ఉండే సి పుష్కలంగా సహజ బ్లీచింగ్ లా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.ఇందుకోసం నారింజ రసాన్ని పిండి కాళ్లకూ చేతులకు పట్టించండి.పదిహేను నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేయండి.తరచుగా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Telugu Tips, Cucumber, Curd, Skin, Legs, Lemon, Potato, Tomato-Telugu Health

టొమాటోలల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎండకు కమిలిపోయిన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతో సహాయపడుతుంది.అంతేకాదు కాదు ఇది ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కూడా రక్షిస్తాయి.టొమాటోలల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది స్కిన్ మెరిసేలా చేస్తుంది.
బంగాళాదుంప‌ను ఉడ‌కిబెట్టి.మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా బాదాం నూనె మ‌రియు గ్లిజరిన్ రెండూ వేసి మిక్స్ చేసి… చేతుల‌కు అప్లై చేయాలి.ఒక గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.

చేతులు మృదువుగా, కోమ‌లంగా మార‌తాయి.అలాగే కొద్దిగా తేనెలో పంచ‌దార మ‌రియు నిమ్మ‌రసం వేసి.

చేతుల‌కు నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి.అనంత‌రం గోరువెచ్చ‌టి నీటితో చేతుల‌ను శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మృత కణాలు తొల‌గి.మృదువుగా, అందంగా మార‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube