శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. భక్తుల వసతి గదులపై టీటీడీ కీలక నిర్ణయం..

తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తులకు అగ్ర తాంబూలం ఇచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది.శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

 Good News For Sri Venkateswara Swamy Devotees Ttd's Key Decision On Accommodatio-TeluguStop.com

అన్నీ అనుకున్నట్లు పాలకమండలి సమావేశంలో ఆమోదం పొందితే తిరుమలలో వసతి కష్టాలు మాత్రమే కాకుండా అత్యధిక సదుపాయాలు కలిగిన వసతి గదులను అందించే అవకాశం ఉంది.

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు(Devotees) తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.

ఇలా తిరుమలకు చేరుకున్న భక్తులకు వసతి సదుపాయం ఎంతో అవసరం.గత ఆరు దశాబ్దాల క్రితం నిర్మాణం చేసిన వసతి గదులు ఈ రోజు కూడా వినియోగంలో ఉన్నాయి.

చాలా సార్లు మరమ్మత్తులు నిర్వహించిన స్వల్పకాలికంగా మాత్రమే ఆ గదులు ఉపయోగపడుతున్నాయి.దీంతో సామాన్య భక్తులకు జారీ చేసే వసతి గదులు విషయంలో తిరుమల దేవస్థానం(TTD) ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.

Telugu Bakti, Devotees, Devotional, Srivenkateswara, Tirumala-Latest News - Telu

ఈ రోజు పరిస్థితులకు తగ్గట్టుగా పాత భవనాల్లో నిర్మాణం చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది.తిరుమలలో దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన సత్రాలను పూర్తిస్థాయిలో తొలగించి వాటి స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తుంది.ఆధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించేలా ఉన్నత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ప్రస్తుతం తిరుమల పై దాదాపు 7,500 గదులను భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కేటాయిస్తోంది.

వీటిలో 30 నుంచి 60 సంవత్సరాల కిందట నిర్మించిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి.ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాలుగా అనేక కాటేజీలకు కోట్ల వ్యయంతో మరమ్మత్తులను చేస్తున్నారు.

అన్నిటిలోనూ గీజర్లు, టైల్స్, లీకేజీలు లేకుండా మరమ్మతులు చేస్తున్నట్లు సమాచారం.అదే సమయంలో దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన సుదర్శన్ గోవర్ధన్, కల్యాణి సత్రాలను కూడా దశల వారీగా మరమ్మతులు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube