మన భారతదేశంలో ప్రతి గ్రామంలో కచ్చితంగా ఏదో ఒక ఆలయం ఉంటుంది.దేవాలయం లేని గ్రామం అసలు ఉండదు.
సాధారణంగా దేవాలయాలు ఉరి మధ్యలోనూ, కొండల గుట్టల మీద, ఉరి పొలిమేరలో కూడా ఉంటాయి.కానీ దీనికి భిన్నంగా మన దేశంలో ఒక దేవాలయం సముద్ర గర్భంలో ఉంది.
సముద్ర గర్భంలో ఉంటూనే రోజు భక్తులచే ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్న ఈ ఏకైక దేవాలయం గుజరాత్ రాష్ట్రం( Gujarat )లో ఉంది.గుజరాత్ లోని భావ్‌నగర్‌కు దగ్గరలో కొలియక్ అనే గ్రామంలో సముద్ర తీరం నుండి కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంలోని ఒక చిన్న గుట్టపై శివాలయం ఉంది.
రోజుకు కొన్ని గంటలు మాత్రమే ఈ శివాలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది.

మిగతా సమయంలో గుడి సముద్రంలో మునిగిపోయి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం,సాయంత్రం సమయాలలో నిర్దిష్ట సమయం కాగానే శిఖరం, దేవాలయం గుట్ట దర్శనమిస్తాయి.ఈ సమయంలోనే భక్తులు అక్కడికి వెళ్లి స్వామిని సేవించుకుని తిరిగి వస్తారు.
భావ్‌నగర్‌కు సుమారు 30 కిలో మీటర్ల దూరంలో కొలియక్ గ్రామంలో ఈ దేవాలయం ఉంది.ఈ దేవాలయాన్ని పాండవులు( Pandavas ) నిర్మించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
కురుక్షేత్ర సంగ్రామం కారణంగా జరిగిన ప్రాణ నష్టం దాటికి తల్లడిల్లిన పాండవులు తమ పాప ప్రక్షాళనకు ఈ దేవాలయాన్ని నిర్మింరని పురాణాలలో ఉంది.అందుకే దీనిని నిష్కళంక్ శివాలయం అని కూడా పిలుస్తారు.

అలాగే ఉదయం సుమారు సాధారణ సముద్రంగా కనిపించి సరిగ్గా 11 గంటలు కాగానే సముద్రం నిదానంగా వెనక్కి వస్తుంది.అప్పుడు మనకు ఈ దేవాలయం స్పష్టంగా కనిపిస్తుంది.ఈ సమయంలో భక్తులు దేవాలయంలో పూజలు చేస్తారు.అలాగే మధ్యాహ్నం కాగానే మళ్లీ సముద్రం ఆలయాన్ని క్రమంగా ముంచుతూ అర్ధరాత్రి అయ్యేసరికి 20 మీటర్ల ఎత్తైన ఆలయపు ధ్వజస్తంభంతో సహా మొత్తం మునిగిపోతాయి.
కానీ ధ్వజస్తంభం మీద ఎగిరే జెండా మాత్రం ఆలయపు గుర్తుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది.వందల సంవత్సరాలుగా భక్తులచే పూజలు అందుకుంటున్న శివాలయానికి అమావాస్య, పౌర్ణమి రోజున ఎంతో మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.
DEVOTIONAL