కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు ఈనెల 17వ తేదీన ఆయన రాష్ట్రానికి విచ్చేయనున్నారు.
ఇందులో భాగంగా రాహుల్ గాంధీ మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు.పర్యటనలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు 17న పాలకుర్తి, వరంగల్ తో పాటు భువనగిరిలో కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు.అయితే తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.







