మహాభారతం ప్రకారం ద్రౌపది( Draupadi ) తన ఐదుగురు భర్తలలో అర్జునుడిని ఎక్కువగా ప్రేమించిందని పండితులు చెబుతున్నారు.అయితే ఐదుగురిలో భీముడు ద్రౌపదిని ఎక్కువగా ప్రేమించేవాడు.
అతిరథ, మహారథులు ఉన్న కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపది కి జరిగిన అన్యాయానికి మొట్టమొదటిగా కౌరవులకు వ్యతిరేకంగా నిరాశన తెలిపిన వ్యక్తి భీముడు( Bheemudu ) అని పెద్దవారు చెబుతూ ఉంటారు.ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీముడు చేసిన అనేక ప్రమాణాలు మహాభారత యుద్ధానికి ప్రధాన కారణాలు అని చెబుతున్నారు.
ఈ మహా యుద్ధంలో లక్షలాది మంది యోధులు చనిపోయారు.కురు సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన భీముడు దుశ్శాసనుడి రక్తంతో ద్రౌపది జుట్టును కడుగుతానని ప్రతిజ్ఞ చేశాడు.
ముఖ్యంగా చెప్పాలంటే మహాభారతంలో యుధిష్ఠిరుడు( Yudhishthirudu ) పాచికలాడే సమయంలో ద్రౌపదిని పందెం పెడతాడు.దీనిని సద్వినియోగం చేసుకున్నందుకు ద్రౌపది కౌరవుల చేతుల్లో అవమానం పాలయ్యేలా, పాచికల ఆటలో దుర్యోధనుడిని గెలిపించేలా శకుని మోసం చేస్తాడు.
ఈ సమయంలో దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకుని కౌరవ సభలోకి తీసుకొని వస్తాడు.ఇంతా జరుగుతున్న పాండవులు ఆట నియమాలను కాదనలేక పోతారు.కానీ వారిలో ప్రతీకార జ్వాల రగులుతుంది.దుశ్యాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని సభలకు తీసుకొని రావడం చూసిన భీముడు అది భరించలేక పట్టలేని కోపంతో దుశ్శాసనుడి రక్తం తాగుతానని ఆ రక్తంతో రక్తంతో ద్రౌపది జుట్టును కడుగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు.
ముఖ్యంగా చెప్పాలంటే దుశ్శాసనుడి రక్తంతో తన వెంట్రుకలను శుభ్రం చేసేంతవరకు జుట్టు ముడి వెయ్యనని ద్రౌపది భీముడికి స్పష్టం చేస్తుంది.
ఈ కారణంగానే ద్రౌపది తన కురులను 13 సంవత్సరాలు అలాగే వదిలేసింది.ద్రౌపదికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి భీముడు కురుక్షేత్ర యుద్ధంలో దిగి దుశ్శాసనుడి ఛాతీని చీల్చి అతని రక్తాన్ని తాగి అదే రక్తాన్ని ద్రౌపది కురులకు పూశాడు.అలా భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు.
ముఖ్యంగా చెప్పాలంటే కౌరవులు పాండవులను మోసం చేసి ఆటలో ఓడించి, చాలామంది ఉన్న సభలో ద్రౌపదిని అవమానించకపోతే మహాభారతం అనే మహా యుద్ధం జరిగేదే కాదు.కౌరవులతో పాటు చాలామంది యోధులు ప్రాణాలు కోల్పోయే వారే కాదు అని కొంతమంది మేధావులు చెబుతున్నారు.
DEVOTIONAL