పూజలో కొబ్బరికాయ కుళ్లితే మంచిదా? కాదా?

మనం ఏ గుడికైనా వెళ్లినప్పుడు లేదా ఇంట్లో పూజ చేసుకున్నా కొబ్బరి కాయ కొడ్తుంటాం. ఒక్కోసారి అలా కొట్టిన కొబ్బరి కాయలో పువ్వు వస్తుంటుంది.

 It Is Good Or Bad To Rot The Coconut In Puja , Coconut, Devotional, Kobbari Kaya-TeluguStop.com

 అలా వస్తే చాలా మంచిదని మురిసిపోతుంటారు. మనకు ఏదో మంచి జరుగుతుందని గట్టిగా నమ్ముతుంటారు, అదే కొబ్బరికాయ కుళ్లిపోతే… చెడు జరుగుతుందని బాధ పడిపోతుంటారు.

 కొబ్బరి కాయ కుళ్లిపోతే నిజంగానే మనకు చెడు జరుగుతుందా అంటే కాదని చెబుతున్నాయి పురాణాలు.

పూజలో కొట్టిన కొబ్బరి కాయ కుళ్లితే దోషమేమి కాదంట.

 అపచారం అంతకన్నా కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుళ్లిన కొబ్బరి కాయ కొట్టడం మనకు తెలిసి చేసిన పని కాదు కాబట్టి మన తప్పేమీ ఉండదట.

 ఒక వేళ పూజలో కొట్టిన కొబ్బరి కాయ కుళ్లిపోతే… దానిని మంచి నీటితో శుభ్రం చేసి మళ్లీ మంత్రోచ్ఛారణతో స్వామి వారిని అలంకరిస్తారట. అంటే ఆ దోషం కుళ్లిన కొబ్బరి కాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.

 అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి కాయ కుళ్లితే… కుళ్లిన భాగాన్ని తీసేసి కాళ్లూ, చేతులూ, ముఖమూ కడుక్కొని పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి పూజ ఆరంభించడం మంచిది.

వాహనాలకు కొట్టే కొబ్బరి కాయ కుళ్లితే దిష్టి అంతా పోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు.

 అయినా సరే మళ్లీ వాహనం కడిగి… మళ్లీ కొబ్బరి కాయ కొట్టాలని సూచిస్తున్నారు.  అందుకే కొట్టిన కొబ్బరి కాయ కుళ్లి పోతే భయపడాల్సిన అవసరం ఏం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube