దేవాలయంలో విమానాలే కానుకలు.. ఎక్కడంటే..

దేవునికి భక్తులు కోరిన కోరికలు తీర్చినందుకు కష్టాల నుంచి గట్టెక్కించినందుకు కృతజ్ఞతా భావంతో తమ వంతుగా భగవంతునికి కానుకలు ఇస్తూ ఉంటారు.ఒక దేవాలయంలో మాత్రం వింత సంప్రదాయం ఉంది.

 Airplanes Are Gifts In The Temple.. Where Else , Airplanes , Temple, Devotion-TeluguStop.com

ఎందుకంటే అక్కడ విమానం బొమ్మలే కానుకలుగా భక్తులు భగవంతునికి సమర్పిస్తూ ఉంటారు.ఈ వింత సంప్రదాయం ఎందుకు మొదలుపెట్టారు.

ఎక్కడ, ఎలా మొదలుపెట్టారు.ఇప్పుడు తెలుసుకుందాం.

మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ కు దగ్గరలో తల్హాన్ గ్రామం ఉంది.అక్కడ నిహాల్ సింగ్ గురుద్వారా అనే దేవాలయం ఉంది.

నిహాల్ సింగ్ మంచి మనసున్న వాడు అని అక్కడ ఉన్న స్థానికులు ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు.ప్రతి ఒక్కరికి తనకు తోచిన సాయం చేసేవాడు అని చెబుతూ ఉంటారు.

నీళ్లు తోడుకోవడానికి గిలకలు అమర్చే పని చేసేవాడు అని చెబుతారు.ఆయన చేయి పడగానే బావిలోని నీరు తియ్యగా మారిపోయేదని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు.

Telugu Devotional, Nihalsingh, Punjab, Temple-Latest News - Telugu

కానీ ఒకరోజు తన పనులు చేస్తూ ప్రమాదానికి గురై నిహాల్ సింగ్ చనిపోయాడు.అయితే ఆయన మంచితనం మాత్రం అందరి మనసులో నిలిచిపోయింది.అందుకే ఆయన అనుచరుడు హర్నమ్ ఆయన సమాధిని నిర్మించాడు.అప్పటినుంచి అక్కడి ప్రజలందరూ ఆయన వర్ధంతిని జరపడం మొదలుపెట్టారు.కొన్నాళ్ళకు అదే ఒక పండుగలా మారిపోయింది.ఒకసారి ఈయన ఒక భక్తుడు విదేశాలకు వెళ్లేలా ఆశీర్వదించమని సమాధి వద్ద ప్రార్థన చేశాడు.

అతని కోరిక నెరవేరింది.ఆ విషయాన్ని అతడు ఎంతో సంతోషంగా అందరికీ చెప్పాడు.

అప్పటినుంచి ప్రజలు విదేశాలకు వెళ్లాలని కోరిక ఉన్నవాళ్లంతా అక్కడికి వచ్చి ఒక విమానం బొమ్మను సమర్పించి మొక్కుకోవడం మొదలుపెట్టారు.అప్పటినుంచి రాను రాను ఇది ఒక ఆచారంలా మారిపోయింది.

అలా ఈ దేవాలయంలో నిహాల్ సింగ్ కు విమానాలను కానుకలుగా సమర్పించడం మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube