మనిషికి ప్రేమ, అసూయ, జాలి ఇలా రకరకాల గుణాలు ఉంటాయి.కొందరిని ఇష్టపడతాం, కొందరితో సఖ్యతగా ఉంటాం.
కానీ కొంత మందిని ఎందుకో కారణం లేకపోయినా, మనకు అర్ధం కాకపోయినా ప్రేమిస్తాం లేదంటే ద్వేషిస్తాం.ప్రేమించడం వరకు ఉంటె ఎవరికి ఎలాంటి సమస్య లేదు.
కానీ ద్వేషించడం మాత్రం కాస్త ఇబ్బంది కలిగించేదే కదా.ఇలా టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.అందులో కొందరు కొందరి చేత ఫ్యాన్ గా మార్చబడతారు.కొందరికి మాత్రం పాలనా హీరో బాగా నటించాడు లేదా మంచి వ్యక్తిత్వం కాదు అని ఒక అంచనా ఉంటుంది.
ఒక్క వెంకటేష్ విషయం లో మాత్రం ఇప్పటి వరకు చెప్పిన అన్ని కూడా విరుద్ధం.ఎందుకంటే ఆయన్ను ఎవరు ద్వేహించలేరు.
ప్రేమించకపోయిన ఒక హేటర్ కూడా లేని ఏకైక టాలీవుడ్ హీరో కేవలం విక్టరీ వెంకటేష్ మాత్రమే.అయన సినిమా జీవితం, వ్యక్తి గత జీవితం అంత కూడా ఎంతో నిరాడంబరంగా ఉంటుంది.
ఎక్కడ వివాదాలు కానీ, సమస్యలు కానీ ఉండవు.ఇంటి విషయాలు బయటకు రావు అలాగే బయట నుంచి సినిమా ప్రపంచాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లాడు.

సినిమా ఇండస్ట్రీ లో జెంటిల్ మెన్ గా ఉండే ఏకైక వ్యక్తిగా అయన మాత్రమే ఉంటాడు.ఇక డబ్బుల విషయంలో కూడా ఏ ఒక్క రోజు ఎవరితో తగాదా పడినట్టు ఎక్కడ కనిపించలేదు.పైగా శిఖరం లాంటి రామానాయుడు కొడుకు అయినప్పటికి ఎప్పుడు ఆడంబరాలకు పోలేదు.ఆయనకు సంబందించిన పని ఏంటో చూసుకొని సాయంత్రం అయ్యిందంటే చాలు ఇంటికి వెళ్ళిపోతాడు.అంతలా కుటుంబాన్ని మరియు సినిమాను ప్రేమిస్తాడు.

టాలీవుడ్ లో చాల మంది హీరోలు వయసు పెరిగినా కూడా ఇంకా హీరో గా కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతుంటే అయన మాత్రం నారప్ప, గురు వంటి వయసుకు తగ్గ పాత్రలను చేస్తూ వెళ్తున్నారు.ముగ్గురు బిడ్డలా తండ్రిగా కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.దృశ్యం లాంటి సినిమాలు ఇందుకు నిదర్శనంగా చెప్పచ్చు.
ఇక సినిమాల రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలకు ఎప్పుడు ఇబ్బంది పెట్టని హీరోగా వెంకీ ముందు వరసలో ఉంటాడు.







