వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ షర్మిల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం వాదనల అనంతరం పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.ఈ మేరకు షర్మిల తరపు న్యాయవాది వరప్రసాద్ వాదనలు వినిపించారు.
శాంతి భద్రతల పేరుతో వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు.షర్మిల పాదయాత్రను కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఇప్పటివరకు ఆమె 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారని న్యాయవాది కోర్టుకు వెళ్లడించారు.ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చినా పాదయాత్రకు ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో అనుమతి ఇచ్చిన కోర్టు షరతులను పాటిస్తూ పాదయాత్ర చేసుకోవచ్చని స్పష్టం చేసింది.







