ఫోన్ చూస్తూ దెబ్బలు తగలడం అనేది చాలా మందికి ఎదురైనా సంఘటనలనే చెప్పవచ్చు.ఎందుకంటే ఫోన్ లోకం అలా ఉంటుంది కాబట్టి.
గేమ్స్, చాటింగ్, షాపింగ్ ఇలా ఇతర ఎంటర్టైన్మెంట్ల ద్వారా ఫోన్లో మునిగిపోవడంతో మన ముందు ఏం జరుగుతుందో కూడా మనం గుర్తించలేం.అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఫోన్ చూస్తూ మరో మైకంలో మునుగుతూ దెబ్బలు తగిలించుకుంది.
ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.
తన అందంతో మాత్రం కుర్రాలను ఫిదా చేసింది.ఇక ఈ ముద్దుగుమ్మ చిన్న హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ రేంజ్ కు దూసుకెళ్లింది.
అలా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కాజల్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.

వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు అడ్వర్టైజ్మెంట్లలో చేసింది కాజల్.అంతేకాకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా కాజల్ ను ఆహ్వానించేవాళ్లు.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో గౌతమ్ కిచ్లూ అనే బడా వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది కాజల్.
ఇక ఆ మధ్యనే పండంటి బాబుకు జన్మనిచ్చింది కూడా.దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్.ఇక బాబు పుట్టాక కూడా తన బాడీలో ఎటువంటి మార్పులు లేవు.

అంతగా యాక్టివ్ గా లేకున్నా కూడా మళ్లీ వర్కౌట్లు చేస్తూ స్ట్రాంగ్ గా మారింది కాజల్.పైగా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.
అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్ కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఈ మధ్య మళ్లీ అడ్వటైజ్మెంట్లలో కూడా చేస్తుంది కాజల్.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా.తన ఇన్ స్టా లో ఒక వీడియో పంచుకుంది.
అందులో కాజల్ ఫోన్ లో చూస్తూ మగ్గుతో గ్లాస్ లో వాటర్ పోస్తూ కింద పడేసింది.

తర్వాత తన నెత్తిపై ఉన్న స్పెట్స్ మర్చిపోయి స్పెట్స్ ఎక్కడ అని అడిగింది.ఇక మళ్లీ ఫోన్ చూస్తూ పదేపదే దెబ్బలు తగిలించుకుంది.అయితే తను ఆ ఫోన్లో అంతగా మునగటానికి కారణం ఏంటంటే.
ప్రస్తుతం మింత్రా అనే షాపింగ్ యాప్ లో బాగా ఆఫర్స్ ఉండటంతో ఆ ఆఫర్స్ గురించి ప్రమోషన్ చేసింది.దీంతో తను ఆ ఆఫర్స్ చూసి ఆశ్చర్యపోతూ దెబ్బలు తగిలించుకుంది.
అంటే ఆఫర్స్ అంత అనుకూలంగా ఉన్నాయని అర్థం.ఇక దీంతో ఇందులో షాపింగ్ చేయమంటూ ఆఫర్ చేసింది కాజల్.
అలా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది.