చాలామంది నెల మొత్తం రాత్రి పగలు కష్టపడుతున్న అప్పటికీ వారికి ఏ మాత్రం డబ్బు ఆదా ఉండదు.ఏదో ఒక సమస్యల కారణంగా లేదా వృధా ఖర్చుల వల్ల డబ్బు చేతిలో లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.
ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే.డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
మరి పౌర్ణమి రోజు ఆచరించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
పౌర్ణమి రోజు ఉదయం లేదా సాయంత్రం మన ఇంట్లో వెంకటేశ్వర లేదా లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోకు తులసి మాలలను సమర్పించి ఆవునేతితో దీపం వెలిగించాలి.దీపం వెలిగించే ముందు దీపానికి గంధంతో అలంకరించి ఆ తర్వాత దీపంలో చిటికెడు పసుపు, పచ్చ కర్పూరం, యాలకులు వేసి స్వామివారి ముందు మన కోరికలను సమస్యలను తెలియజేస్తూ దీపం వెలిగించి పూజ చేయాలి.
ఇలా స్వామివారికి పూజ చేసిన తరువాత పటిక బెల్లం లేదా పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి.

ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేయటం వల్ల నిత్యం మన దగ్గర డబ్బు నిల్వ ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా ఇంట్లో శివలింగం ఉంటే సాయంత్రం మారేడు దళాలను శివలింగానికి సమర్పించి, స్వామివారికి గంధంతో పూజచేసి మారేడు దళాలతో పూజ చేయాలి.ఇక ఆలయానికి వెళ్ళిన వారు స్వామివారిని పూజించిన తర్వాత నంది చెవిలో మన కోరికలను తెలియజేయాలి.
అలాగే మంగళవారం శివుడికి సమర్పించిన బిల్వ దళాలను తీసుకొని మనం డబ్బు నిల్వ చేసే చోట నిల్వ చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఈ విధమైనటువంటి పరిహారం మార్గాలను ప్రతి పౌర్ణమికి చేయవచ్చు.