పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ డైరక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది.సినిమాలో యాక్షన్ సీన్స్ పవన్ లేకుండానే చేస్తున్నారట.
అదేంటి సినిమా హీరో లేకుండా ఫైట్ సీన్స్ ఎలా చేస్తారని డౌట్ పడొచ్చు.పవన్ లేకుండా పవన్ డూప్ తోనే ఈ సీన్స్ షూట్ చేస్తున్నారట.
ఫైట్ సీన్స్ లాంగ్ షాట్స్ అన్ని డూప్ తో లాగించేస్తున్నారట.వీరమల్లు సగం డూప్ తోనే చేస్తున్నారా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.17వ శతాబ్ధం నాటి కథతో వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాని ఏ.
ఎం రత్నం నిర్మిస్తునారు.సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.
కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అసలైతే సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వడం కష్టం కాబట్టి 2023 సమ్మర్ కి రిలీజ్ చేసే అవకాశం ఉంది.పవన్ ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ మ్యానేజ్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు.
అందుకే హరి హర వీరమల్లు సినిమాని డూప్ తో చేస్తున్నారు డైరక్టర్ క్రిష్.