హీరో రాజశేఖర్ నటించిన అన్న సినిమా గుర్తుందా ? ఈ సినిమాలో తన తమ్ముడిని పెద్ద స్కూల్ లో జాయిన్ చేయాలనే కోరికతో నిల్ డెస్పరాండం అనే స్కూల్ పేరును నిన్ను డ్యాష్ కొడతా అంటూ మార్చి ఫన్ చేసిన సీన్ ఒకటి ఉంటుంది.ఈ చిత్రం లో కామెడీ పెద్దగా ఉండదు కానీ ఈ సీన్ మాత్రం బాగా నవ్వు పుట్టిస్తుంది.
ఈ సినిమా తర్వాత నిల్ డెస్పరాండం పేరు చెప్తే చాలు అందరికి అన్న మూవీ గుర్తుకు వస్తూ ఉంటుంది.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1994 లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.
ఇక నిల్ డెస్పరాండం పేరు కూడా బాగానే వినిపించింది.
వాస్తవానికి ఈ పేరు వెనక పెద్ద చరిత్ర ఉంది.హీరో గోపి చంద్ తండ్రి అయినా టి కృష్ణ సినిమా దర్శకుడు అనే విషయం మన అందరికి తెలిసిందే.టి కృష్ణ విప్లవాభ్యుదయం కలిగిన వ్యక్తి.
అందుకే శాస్త్రీయత తో కూడా టెక్నీకల్ స్టడీ ని నేటి తరం విద్యార్థులకు అందించాలనే కోరికతో అయన ఒక విద్య సంస్థను నెలకొల్పారు.ఇక తన ముగ్గురు పిల్లలను కూడా ఇదే పాఠశాలలో చేర్పించారు.
వారి చుదువులు నిల్ డెస్పరాండం స్కూల్ లో నే సాగాయి.ఫ్రెంచ్ భాషలో నిల్ డెస్పరాండం అనే పదానికి అర్ధం నిరాశ చెందవద్దు అని.ఒంగోలు లో నెలకొల్పిన ఈ విద్య సంస్థ ఇప్పటికి కృష్ణ గారు చనిపోయాక అయన స్నేహితుల సహాయంతో ముందుకు కొనసాగుతూ ఉంది.
తనలో ఉండే విప్లవ భావాలను సినిమాలుగా మలిచి ప్రజలకు అందించిన టి కృష్ణ చిన్న వయసుకొనే కన్ను మూసారు.అయన పెద్ద కుమారుడు ప్రేమ్ చంద్ సైతం అతి చిన్న వయసులోనే పోయారు.ఇక సమాజానికి పనికి వచ్చే సినిమాలతో పాటు, విప్లవం ప్రాధాన్యత తో కూడా విద్యను అందించాలనే ఉద్దేశం చాల గొప్పది.
అది నేటి తరం వారికి అస్సలు అర్ధం కాకపోయినా ఎదో ఒక రోజు అందరికి అర్ధం అవుతుంది అనే భావన తో అయన ఈ స్కూల్ ని ప్రారంభించారు.ఇక తండ్రి ఆశయాన్ని కొనసాగించడానికి అప్పుడప్పుడు గోపి చంద్ కూడా ఈ స్కూల్ ని సందర్శిస్తున్నారు.