2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటికి.ఆ విజయంలో జనసేన బీజేపీ పార్టీలకు కూడా భాగం ఉందనేది అందరికీ తెలిసిందే.ఆ తరువాత కొన్నాళ్లు బీజేపీతో దోస్తీ కొనసాగించిన టీడీపీ.ఆ తరువాత కేంద్రం తీరుపై వ్యతిరేక గళం వినిపిస్తూ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది.దాంతో 2019 ఎన్నికల్లో ఏమాత్రం బలంలేని కాంగ్రెస్ తో చేతులు కలిపి ఘోర పరాజయాన్ని చవి చూసింది టీడీపీ.ఇక వచ్చే ఎన్నికల్లో 2014 సీన్ రిపీట్ చేయాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికి.
బీజేపీ మాత్రం చంద్రబాబుతో కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడడంలేదు. ఎన్నో సందర్భాలలో బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు సంకేతాలు ఇచ్చినప్పటికి.
కమలనాథులు మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా టీడీపీతో పొత్తుకు సిద్దమౌతుందా లేదా అనేది కూడా అనుమానే.దాంతో ప్రస్తుతం చంద్రభాబు ఒంటరిపోరుకే సిద్దమయ్యారు.ఇదిలా ఉంచితే ప్రస్తుతం బీజేపీకి చంద్రబాబు గండం పొంచి ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే బీజేపీ నుంచి తాజాగా సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ బయటకు వచ్చారు.ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.ఈ నెల 24 న ఆయన టీడీపీ కండువ కప్పుకొనున్నట్లు తెలుస్తోంది.కన్నా తో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారట.
ఒకవేళ బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరి ఉంటే.ఆ పార్టీ నేతలకు టీడీపీ ఆశ్రయం కల్పించేది కాదు.
కానీ ప్రస్తుతం బీజేపీ టీడీపీ పొత్తు జరిగే అవకాశం లేదు కాబట్టి బీజేపీ నుంచి బయటకు వచ్చే నేతలను టీడీపీలో కలుపుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.దీంతో బీజేపీకి చంద్రబాబు ముప్పు పొంచి ఉందని కొందరి అభిప్రాయం.అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలంటే ఖచ్చితంగా టీడీపీ ఇతర పార్టీలతో కలవాల్సిన పరిస్థితి.
ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే అదొక్కటే మార్గం.ఇప్పటికే జనసేన టీడీపి కలుస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది.
జనసేన కూడా బలంలేని బీజేపీతో ఉండడం కంటే బలమైన టీడీపితో కలిస్తే మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది.కాబట్టి ఎన్నికల నాటికి టీడీపి జనసేన కలిసిన ఆశ్చర్యం లేదు.
అదే గనుక జరిగితే.అసలే బలహీనంగా ఉన్న కాషాయ పార్టీ.
పూర్తిగా డీలా పడడం ఖాయం.మొత్తానికి అన్నీ విధాలుగా బీజేపీకి చంద్రబాబు గండం గట్టిగానే పొంచి ఉంది.