డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన యాక్షన్ మూవీ డాకు మహారాజ్( Daku Maharaj ) పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయింది.డాకు మహారాజ్ మూవీ ఇప్పటికే 75 కోట్ల రూపాయల ( 75 crore rupees )షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

 Daaku Maharaj Movie Hindiversion Bookings Details Inside Goes Viral In Social Me-TeluguStop.com

ఈరోజు డాకు మహారాజ్ హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో అయితే లేవు.

పుష్ప ది రూల్ మూవీ( Pushpa the rule movie ) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ 500 నుంచి 600 స్క్రీన్లలో రిలీజైంది.

అయితే భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడంతో ఈ సినిమా అక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.డాకు మహారాజ్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది.

Telugu Daaku Maharaj, Daku Maharaj, Pragya Jaiswal-Movie

డాకు మహారాజ్ సినిమాకు హిందీ ప్రమోషన్స్( Hindi Promotions ) జరిగితే మాత్రం ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉంది.ఛంబల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కావడంతో అక్కడి ప్రేక్షకులకు సులువుగానే ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ( Pragya Jaiswal, Shraddha Srinath )లకు ఈ సినిమా ఒకింత భరీ సక్సెస్ ను అందించిందనే సంగతి తెలిసిందే.

Telugu Daaku Maharaj, Daku Maharaj, Pragya Jaiswal-Movie

డాకు మహారాజ్ మూవీ సక్సెస్ వల్ల డైరెక్టర్ బాబీకి సైతం ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ సినిమా సక్సెస్ తో అటు బాలయ్య ఇటు బాబీ రెమ్యునరేషన్ భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.వరుస విజయాలతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా డాకు మహారాజ్ నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube