జనవరి 23న దేశవ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని( Netaji Subhash Chandra Bose birth anniversary ) ఘనంగా జరుపుకున్నారు.నేతాజీ జయంతిని “పరాక్రమ్ దివస్”గా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ నాయకుడైన సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు గౌరవప్రదంగా నివాళులు అర్పించింది.
అయితే, హైదరాబాదుకు చెందిన ఓ సైక్లిస్ట్ మాత్రం ఈ సందర్బంగా వినూత్నంగా నేతాజీకి నివాళి అర్పించారు.రిటైర్డ్ ఆర్మీ జవాన్ అనిల్ కుమార్ ( Retired Army jawan Anil Kumar )నేతాజీ బోస్‌కు తన ప్రత్యేకమైన గౌరవాన్ని చూపుతూ 913 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు.హైదరాబాదులోని ఏఓసీ సెంటర్ నుంచి మొదలై ఫాక్స్ సాగర్ వద్ద ముగిసేలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆకారంలో ఓ ప్రత్యేక రూట్ మ్యాప్‌ను రూపొందించి, దాని ప్రకారం 11 రోజుల పాటు సైక్లింగ్ చేశారు.
తాను నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఈ వినూత్న ఆలోచన తలపెట్టినట్లు ఈ సందర్బాన్ని అనిల్ కుమార్ తెలిపారు.ఈ వినూత్న ఆలోచనతో నేతాజీ జయంతి రోజున ఆయన అందరికీ స్పూర్తిగా నిలిచారు.ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.నేతాజీ బోస్ జాతీయత, ధైర్యసాహసాలు దేశానికి ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంటాయి.ఆయన జయంతిని ఇలా ఒక ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం దేశ ప్రజలకు కొత్త దిశను చూపిస్తుందని చెప్పాలి.ఈ విషయాన్ని గమనించిన సోషల్ మీడియా వినియోగదారులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మీరు మీ అభిమానాన్ని సరికొత్తగా ప్రపంచానికి తెలిపారు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మీరు సైక్లింగ్ చేయడం ఎంచుకొని ఎంతోమందికి ప్రేరణగా నిలిచారంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.