విశ్వక్ సేన్ ( Vishwak Sen )హీరోగా, ఆకాంక్ష శర్మ( Akanksha Sharma ) హీరోయిన్‌గా, రామ్ నారాయణ్ దర్శకత్వంలో, సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’ ( Laila )ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సందర్భంగా గురువారం “ఇచ్చుకుందాం బేబీ” అనే పాటను లాంచ్ చేశారు సినిమా బృందం.
ఈ పాట విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో విశ్వక్ సేన్ తన అనుభవాలను పంచుకున్నారు.నా కెరీర్‌లో యాక్షన్ టచ్‌తో ఉన్న కామెడీ సినిమా ఇది.ఇలాంటి కథతో సినిమా చేయాలని ఎప్పటినుంచి అనుకుంటున్నాను.లైలా లాంటి పాత్ర పోషించేందుకు ఎప్పటికీ ఇష్టపడ్డాను.
ఈ అవకాశాన్ని ఇచ్చిన సాహు అన్నకు థ్యాంక్స్ చెప్పడం మాత్రమే నా బాధ్యత అని విశ్వక్ సేన్ అన్నారు.
అంతేకాకుండా, లైలా పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టేదని.ఈ కొత్త సినిమా ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతునాన్నని అన్నారు.లైలా సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసిన క్లీన్ ఎంటర్‌టైనర్ అని విశ్వక్ సేన్ అన్నారు.
అలాగే, “ఫిబ్రవరి 1న ‘ఓహో రత్తమ్మ’ అనే రాయలసీమ మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నాం అని వెల్లడించారు.
అయితే ప్రెస్ మీట్ సమయంలో, విశ్వక్ సేన్ గెటప్ గురించి జర్నలిస్ట్ చేసిన ప్రశ్నపై స్పందిస్తూ, “మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందని.అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని అనగా.దానికి హీరో సమాధానమిస్తూ.
విషయం మీరు చెబుతున్నారు.కానీ, అంతర్జాతీయ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా? ఎంత అన్యాయం రా? అని అన్నారు.ఇందుకు సంబంధించిన విశ్వక్ సేన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.