ఈ మూడు ఆకులు ఉంటే జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు.. తెలుసా?

ప్ర‌స్తుత రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తీవ్రంగా స‌త‌మ‌తం అయిపోతున్నారు.అయితే జుట్టు రాల‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్న‌ట్లే.

 Super Home Remedy To Get Rid Of Hair Fall! Home Remedy, Hair Fall, Latest News,-TeluguStop.com

ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డానికి కూడా మ‌రెన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా కాస్త శ్ర‌ద్ధ వ‌హించి ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీని పాటిస్తే గ‌నుక‌ మీ జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు.

మ‌రి ఇంకెందుకు లేటు హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే ఆ అద్భుత‌మైన ఇంటి చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా నాలుగు జామ ఆకులు, ఒక కప్పు మున‌గాకు, ఐదు మందారం ఆకులు తీసుకుని నీటిలో వేసి శుభ్రంగా క‌డ‌గాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని.అందులో క‌డిగి పెట్టుకున్న జామ ఆకులు, మున‌గాకు, మందారం ఆకులు, అర క‌ప్పు వెన్న తీసిన మ‌జ్జిగ వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం వేరుచేసుకోవాలి.

ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనెను మిక్స్ చేయాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒక్క సారి చేస్తే చాలు.

జుట్టు రాల‌డం క్ర‌మంగా త‌గ్గి పోతుంది.

అలాగే ఈ రెమెడీని యూజ్ చేయ‌డం వ‌ల్ల జుట్టు పొడ‌వుగా, ఒత్తుగా పెరుగుతుంది.

జుట్టు చిట్లి పోవ‌డం, విరిగి పోవ‌డం వంటివి జ‌ర‌గ‌కుండా ఉంటాయి.మ‌రియు వైట్ హెయిర్ స‌మ‌స్య‌ త్వ‌ర‌గా రాకుండా కూడా ఉంటుంది.

కాబ‌ట్టి, మీ ద‌గ్గ‌ర జామ, మున‌గ‌ మ‌రియు మందారం ఆకులు ఉంటే ఖ‌చ్చితంగా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube