భారతదేశంలోనే (India)అత్యంత పవిత్రమైన నగరాల్లో వారణాసి(India) ఒకటి.ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తుందని, పునర్జన్మల చక్రం నుంచి విముక్తి కలుగుతుందని చాలా మంది నమ్ముతారు.
అందుకే వేలాది మంది తమ చివరి రోజుల్లో ఈ పవిత్ర భూమిపై తుది శ్వాస విడవాలని ఆశతో వారణాసికి వస్తారు.
గంగానది ఒడ్డున (Ganges River)నిరంతరం శ్మశాన వాటికల మంటలు కాలుతూనే ఉంటాయి.
హిందూ విశ్వాసాల ప్రకారం, వారణాసిలో మరణించిన వారు నేరుగా విష్ణుమూర్తి (Vishnumurthy)నివాసమైన వైకుంఠానికి చేరుకుంటారు.ఒకవేళ ఇక్కడ మరణించడం సాధ్యం కాకపోతే, వారి కుటుంబ సభ్యులు వారి చితాభస్మాన్ని గంగానదిలో కలుపుతారు.
తద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తారు.
ఇప్పుడు వారణాసిలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది – ప్రత్యేకమైన “డెత్ హోటల్స్”(Death hotels).
టెర్మినల్ వ్యాధులతో బాధపడుతున్న వారు మరణం కోసం ఎదురుచూస్తూ ఇక్కడకు వస్తారు.ఇటీవల ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (Social media influencer)ఈ ప్రత్యేకమైన వసతి గృహాల గురించి ఒక వీడియోను షేర్ చేశారు.
కోలుకునే అవకాశం లేని వారిని ఈ హోటల్స్ ఆహ్వానిస్తాయి.ఆధ్యాత్మిక వాతావరణంలో వారి చివరి రోజులు గడపడానికి అనుమతిస్తాయి.
వారణాసిలో చనిపోతే స్వర్గానికి చేరుకోవచ్చని చాలా మంది నమ్ముతారు.

అలాంటి ఒక హోటల్ యజమాని మాట్లాడుతూ, “మా హోటల్ మరణం కోసం వేచి ఉండే గది లాంటిది.మా అతిథుల్లో చాలా మంది టెర్మినల్ వ్యాధిగ్రస్తులే.రోజుకు కేవలం రూ.20 మాత్రమే ఛార్జ్ చేస్తాం.చాలా మంది ఇక్కడ దాదాపు రెండు నెలలు ఉంటారు” అని తెలిపారు.
కాలక్రమేణా ఈ “డెత్ హోటల్స్” సంఖ్య పెరిగింది.ఇలాంటి ప్రదేశాల గురించి తెలియని వారు ఆశ్చర్యపోతున్నారు.
కాశీ విశ్వనాథ్ ధామ్ సమీపంలో ఉన్న ముముక్షు భవన్ ఈ కోవకు చెందిన వాటిలో బాగా పేరుగాంచినది.ఇక్కడ దాదాపు 40 మంది వృద్ధులు నివసిస్తున్నారు.
కొందరైతే సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నారు.లక్సా ప్రాంతంలో ఉన్న ముక్తి భవన్(Mukti Bhavan) కూడా ప్రసిద్ధి చెందిన మరొక ఆశ్రమం.

కాశీ విశ్వనాథ్ ధామ్ పునరాభివృద్ధి తర్వాత కొత్త ముముక్షు భవన్ నిర్మించడం జరిగింది.తారా సంస్థాన్, ఉదయ్‌పూర్‌లోని నారాయణ్ సేవా సంస్థాన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ భవన్ 40 మంది వరకు ఉచిత వసతి, భోజనం వైద్య సంరక్షణను అందిస్తుంది.విరాళాలు ఈ సౌకర్యాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి.నివాసితులకు ఉచిత భోజనం, ఉదయం, సాయంత్రం టీ, వైద్య సంరక్షణ లభిస్తాయి.వైద్యులు, నర్సులు, కౌన్సెలర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు.“మేం ఎలాంటి ఫీజు వసూలు చేయము.నివాసితులు చిన్న వంటగదిలో తమకు కావాల్సిన ఆహారాన్ని కూడా వండుకోవచ్చు” అని సౌకర్యాల మేనేజర్ సునైనా ఖారే తెలిపారు.
వారణాసిలో చాలా మంది మరణాన్ని దుఃఖించకుండా వేడుక చేసుకుంటారు.
అంతిమ సంస్కారాల ఊరేగింపులో పాటలు, నృత్యాలు ఉంటాయి.ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని శివుని భక్తులు నమ్ముతారు.
మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ రెండింటిలోనూ సామూహిక దహన సంస్కారాలు జరుగుతాయి.ఈ రెండు ఘాట్లు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు.
ముముక్షు భవన్ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 4,000 మంది పవిత్ర నగరమైన వారణాసిలో మరణించాలనే తమ చివరి కోరికను నెరవేర్చుకున్నారు.







