ప్రముఖ భారతీయ ట్రావెల్ వ్లాగర్ మహమ్మద్ అనాస్ ఖాన్ (Indian travel vlogger, Mohammed Anas Khan)ఇటీవల ఆఫ్రికా దేశమైన(African country) ఈక్వటోరియల్ గినియాలో ఊహించని సమస్యను ఎదుర్కొన్నాడు.‘ట్రావెల్ విత్ AK’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచ యాత్రలు చేస్తూ వీడియోలు తీసే అనస్(Anas), రోడ్డుపై సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా ఒక స్థానికుడు అకారణంగా అతన్ని అడ్డుకున్నాడు.
అనస్ వీడియో తీస్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆ వ్యక్తి, ఎందుకు వీడియో తీస్తున్నావంటూ హంగామా చేశాడు.అంతేకాదు, అతని చేతిలోని కెమెరా లాక్కోవడానికి కూడా ప్రయత్నించాడు.తాను ఎవరినీ చిత్రీకరించడం లేదని, కేవలం తన వీడియో మాత్రమే తీసుకుంటున్నానని అనస్ ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినిపించుకోలేదు.బెదిరింపు స్వరంతో మాట్లాడుతూ మరింత గొడవ చేశాడు.
పాస్‌పోర్ట్(Passport) చూపించమని డిమాండ్ చేశాడు.

స్థానికుడి ప్రవర్తనతో భయాందోళనకు గురైన అనస్, వెంటనే పోలీసులకు(police) ఫోన్ చేస్తానని గట్టిగా చెప్పాడు.ఊహించని ఈ సంఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.స్థానికుడి దురుసు ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.”వేరే వాళ్లని ఇబ్బంది పెట్టడం తప్పు.అతను కేవలం తన వ్లాగ్ కోసం వీడియో తీసుకుంటున్నాడు అంతే” అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, “వాళ్లు మన దేశానికి వచ్చినప్పుడు మనం ఎంత గౌరవిస్తాం.కానీ వాళ్లే ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరికాదు” అని మరొకరు మండిపడ్డారు.

అయితే, ఇది ఒక్కటే సంఘటన కాదని, ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.“ఇది ఒక రకమైన మోసం.ఇండియాలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి.టూరిస్టులను బెదిరించి డబ్బులు గుంజడానికి కొంతమంది ఇలా డ్రామాలు క్రియేట్ చేస్తారు” అని ఒక యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులను చూసే విధానంపై చర్చ మొదలైంది.విదేశాల్లో వ్లాగర్లు, టూరిస్టుల భద్రత గురించి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణాలు చేయడం ఇప్పుడు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.








