చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో (Jiangsu Province, China)లి అనే వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది.సుమారు రూ.2 కోట్ల 24 లక్షలు పెట్టి ఏడేళ్ల క్రితం ఇల్లు కొన్నాడు.అంతా బాగానే ఉంది అనుకున్నాడు కానీ అసలు విషయం తాజాగా తెలిసింది.
ఇటీవల ఇల్లు శుభ్రం చేస్తుండగా, అతనికి మెట్ల వెనుక ఓ రహస్య తలుపు(Secret door) కనిపించింది.అంతే, ఆ తలుపు తీస్తే నేరుగా కిందకు సెల్లార్‌లోకి దారి.
అది కూడా ఊహించని సెల్లార్.
ఆ సెల్లార్ మామూలుగా లేదు.
అన్ని హంగులతో అదిరిపోయింది.వెంటిలేషన్ సిస్టమ్, లైట్లు, చిన్నపాటి బార్ (Ventilation system, lights, small bar)కూడా ఉన్నాయి.అంతేకాదు, ఆ సెల్లార్‌ని రీసెంట్‌గా వాడినట్టు కూడా ఆనవాళ్లు కనిపించాయి.“చూస్తుంటే ఒళ్లు జలదరించింది” అంటూ ఆ రహస్య స్థలాన్ని చూసి లి భయంతో చెప్పాడు.

వెంటనే లి పాత ఓనర్ జాంగ్‌కి(Zhang) ఫోన్ చేసి నిలదీశాడు.“ఇల్లు అమ్మేటప్పుడు సెల్లార్ గురించి ఎందుకు చెప్పలేదు?” అని బెదిరిస్తూ అడిగాడు.జాంగ్ చెప్పిన సమాధానం విని లికి మరింత షాక్ తగిలింది.“నేను నీకు ఇల్లు మాత్రమే అమ్మేశాను, సెల్లార్ కూడా అమ్మేశానని ఎప్పుడు చెప్పాను?” అంటూ ఎదురు ప్రశ్నించింది జాంగ్.“అది నా పర్సనల్ స్పేస్.అది అమ్మకంలో భాగం కాదు” అని తెగేసి చెప్పింది.
అంతేకాదు, “సెల్లార్ నీదైతే, నేను రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికి వెళ్లాలి?” అని అడిగేసరికి లి నోట మాట రాలేదు.

జాంగ్‌కి లికి తెలియకుండా సెల్లార్‌లోకి ఎలా వెళ్లేదో ఎవరికీ అర్థం కాలేదు.కొందరైతే ఆమె దగ్గర స్పేర్ కీ ఉండి ఉంటుందని అన్నారు.మరికొందరు పార్కింగ్ ఏరియా నుంచి రహస్య ప్రవేశం ఏదైనా ఉందేమో అని అనుమానించారు.
విసిగిపోయిన లి నేరుగా కోర్టుకు వెళ్లాడు.కోర్టు మాత్రం లి వైపే తీర్పునిచ్చింది.
సెల్లార్ చట్ట ప్రకారం లికే చెందుతుందని స్పష్టం చేసింది.అంతేకాదు, జాంగ్ అతనికి నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది.
ఈ విచిత్రమైన కేసు సోషల్ మీడియాలో వైరల్ అయింది.చాలా మంది యూజర్లు దీన్ని సౌత్ కొరియన్ సినిమా ‘పారసైట్’తో పోల్చారు.ఆ సినిమాలో ఒక వ్యక్తి రహస్యంగా సెల్లార్‌లో జీవిస్తాడు.మరికొందరు రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో ఈ ఘటన ద్వారా తెలుస్తుందని కామెంట్ చేశారు.
ఏదేమైనా ఈ సంఘటన మాత్రం ఇంకా నెట్టింట హాట్ టాపిక్‌గానే ట్రెండ్ అవుతోంది.







