మా అమ్మకు ఫోన్ చేసి నేను ఏడ్చేశాను.. అందుకే ఎలిమినేట్.. దివి కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు నటి బిగ్ బాస్ బ్యూటీ దివి ( Bigg Boss Beauty Divi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దివి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Divi Comments On Bigg Boss Regarding Her Elimination,divi, Bigg Boss Divi, Comme-TeluguStop.com

మొదట మోడల్ గా కెరియర్ను ప్రారంభించిన ఈమె మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత అదే ఊపుతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది.సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.

ప్రస్తుతం చిన్న సినిమాల నుంచి వెబ్ సిరీస్ లతోపాటు పెద్ద పెద్ద సినిమాలలో కూడా నటిస్తోంది.

Telugu Bigg Boss Divi, Divi, Divi Bigg Boss-Movie

ఇటీవలే విడుదల అయిన డాకు మహారాజ్, పుష్ప 2 ( Daku Maharaj, Pushpa 2 )లాంటి సినిమాలలో కూడా నటించే విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా బిగ్బాస్ హౌస్ సమయంలో జరిగిన విషయం గురించి స్పందించింది.

ఈ సందర్భంగా దివి మాట్లాడుతూ.బిగ్ బాస్ కు మోడల్ లాగే నన్ను సెలెక్ట్ చేసారు.

బిగ్ బాస్ ముందు ఒక నాలుగు ఇంటర్వ్యూలు చేసారు సెలెక్ట్ చేయడానికి.అప్పుడు నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

అన్ని ఓకే అయి సెలెక్ట్ అయ్యాను.అంతకు ముందు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది కానీ అప్పుడు కాన్ఫిడెంట్ లేదు.

అందుకే వద్దన్నాను.నాకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి ఉంటే బిగ్ బాస్ కి వెళ్లేదాన్ని కాదు.

Telugu Bigg Boss Divi, Divi, Divi Bigg Boss-Movie

కానీ బిగ్ బాస్ వల్ల నాకు హెల్ప్ అయింది.బిగ్ బాస్ కి వెళ్లే రోజు ఉదయం చాలా టెన్షన్ గా ఉంది.అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేసాను, నేను వచ్చేస్తాను, నా వల్ల కాదు అని చెప్పాను.కరోనా కావడంతో పార్క్ హోటల్ లో అప్పటికే 20 రోజులు లాక్ డౌన్ లో ఉంచారు.

మా అమ్మ నువ్వు వెళ్ళు, ఎలా ఉన్నా మాకు ఓకే అని చెప్పింది.అప్పటి దాకా నన్ను తిట్టిన పేరెంట్స్ అప్పుడు నాకు గుడ్ డేస్ వచ్చాయి అని భావించారు.అప్పటి దాకా డబ్బులు సంపాదించట్లేదు అన్నారు.కానీ బిగ్ బాస్ లో వారానికి ఇంత అని ఇస్తారు కాబట్టి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి అని ఓకే చెప్పారు అని తెలిపింది.

నేను బిగ్ బాస్ లో 7 వారాలు ఉన్నాను.ఆల్మోస్ట్ 50 రోజులు అప్పటికే అలిసిపోయాను.

నాకు సైలెంట్ గా ఉండటం, ఒక్కదాన్నే ఉంటడం ఇష్టం.కానీ అక్కడ అందరూ గోలగోలగా ఉంటారు.

ఒకరికొకరు తినిపించుకుంటారు.హగ్గులు ఇచ్చుకుంటారు, తెగ యాక్టింగ్ చేసేస్తారు కెమెరాల ముందు.

నాకు అవన్నీ వచ్చేవి కాదు.నాగార్జున గారు నాకు మొదట్నుంచి సపోర్ట్ ఇచ్చారు.

నేను దసరాకి ఎలిమినేట్ అయ్యాను.ఆ రోజు నాగార్జున గారు లేకపోవడంతో సమంత వచ్చింది.

సమంత హోస్ట్ గా నన్ను ఎలిమినేట్ చేసారు.నాగార్జున గారు ఉంటే నేను ఇంకొన్ని రోజులు ఉండేదాన్ని ఏమో అని తెలిపింది దివి.

బిగ్ బాస్ జరిగిన ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ దివి తన ఎలిమినేషన్ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube