ఇదేందయ్యా ఇది.. 'కన్నప్ప' లో ప్రభాస్ లుక్ ఇలా ఉంది!

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa)సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, భక్తి చిత్రం మాత్రమే కాకుండా ఒక చారిత్రక గాధ అని విష్ణు (Vishnu)పేర్కొన్నారు.ఈ సినిమా షూటింగ్ అధిక భాగం న్యూజిలాండ్‌లో జరిగింది.ఇప్పటికే విడుదలైన ‘కన్నప్ప’ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.అంతేకాకుండా, ఈ టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.దీంతో సినిమా చుట్టూ మరింత హైప్ క్రియేట్ అయింది.

 This Is It.. This Is What Prabhas Looks Like In 'kannappa'!, Prabhas, Kannappa,-TeluguStop.com

ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ (Prabhas, Akshay Kumar, Shivraj Kumar)వంటి స్టార్ నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.అలాగే కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.ఇకపోతే, తాజాగా చిత్రయూనిట్ ప్రభాస్ లుక్‌ను విడుదల చేసింది.

మొదట్లో ప్రభాస్ ఈ సినిమాలో శివుడు పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి.కానీ తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, శివుడి పాత్రను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పోషించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాలో ‘రుద్ర’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.

“ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు!! శివాజ్ఞా పరిపాలకుడు!!!” అంటూ విడుదలైన ప్రభాస్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ట్రెండ్ అవుతోంది.అయితే నెటిజన్లు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది “లుక్ అదిరిపోయింది!” అంటూ కామెంట్ చేస్తుండగా.

, మరికొందరు “ఆశించిన స్థాయిలో లేదు” అంటూ విమర్శలు చేసేవారు కూడా లేకపోలేదు.టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మరో పాన్-ఇండియా మూవీగా ‘కన్నప్ప’ నిలవనుంది.

విశేషంగా, ఇందులో ప్రభాస్ పాత్ర సినిమా హైలైట్ కానుందని చిత్రయూనిట్ ఇదివరకే తెలిపింది.ఏప్రిల్ 25న ఈ ఇనిం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube