ఇదేందయ్యా ఇది.. ‘కన్నప్ప’ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంది!

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కన్నప్ప' (Kannappa)సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, భక్తి చిత్రం మాత్రమే కాకుండా ఒక చారిత్రక గాధ అని విష్ణు (Vishnu)పేర్కొన్నారు.

ఈ సినిమా షూటింగ్ అధిక భాగం న్యూజిలాండ్‌లో జరిగింది.ఇప్పటికే విడుదలైన 'కన్నప్ప' టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా, ఈ టీజర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.దీంతో సినిమా చుట్టూ మరింత హైప్ క్రియేట్ అయింది.

"""/" / ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ (Prabhas, Akshay Kumar, Shivraj Kumar)వంటి స్టార్ నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

అలాగే కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఇకపోతే, తాజాగా చిత్రయూనిట్ ప్రభాస్ లుక్‌ను విడుదల చేసింది.మొదట్లో ప్రభాస్ ఈ సినిమాలో శివుడు పాత్రలో కనిపిస్తారనే వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, శివుడి పాత్రను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పోషించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాలో 'రుద్ర' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. """/" / "ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు!! శివాజ్ఞా పరిపాలకుడు!!!" అంటూ విడుదలైన ప్రభాస్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా ట్రెండ్ అవుతోంది.

అయితే నెటిజన్లు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది "లుక్ అదిరిపోయింది!" అంటూ కామెంట్ చేస్తుండగా.

, మరికొందరు "ఆశించిన స్థాయిలో లేదు" అంటూ విమర్శలు చేసేవారు కూడా లేకపోలేదు.

టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మరో పాన్-ఇండియా మూవీగా 'కన్నప్ప' నిలవనుంది.

విశేషంగా, ఇందులో ప్రభాస్ పాత్ర సినిమా హైలైట్ కానుందని చిత్రయూనిట్ ఇదివరకే తెలిపింది.

ఏప్రిల్ 25న ఈ ఇనిం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.