ఈ మధ్య కాలంలో విమానాల ప్రమాదాలు అరుచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉండగా.
అమెరికాలో ఆదివారం రోజు ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పిన ఘటన జరిగింది. జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయం(George Bush International Airport ) వద్ద హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం( United Airlines flight ) టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా దాని రెక్కల్లో మంటలు చెలరేగాయి.

సిబ్బంది అప్రమత్తమై వెంటనే టేకాఫ్ నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి బయటకు దింపారు.ఆదివారం, హ్యూస్టన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం.హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు లేక ప్రాణనష్టం జరగలేదు.

ఈ ప్రమాదానికి గల కారణాలను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.విమానంలో మంటలు చెలరేగిన వెంటనే ఎయిర్ పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు.ప్రమాదానికి గురైన విమానం ఎయిర్‌బస్ A-319 మోడల్ అని గుర్తించారు.మరోవైపు, అదే రోజు ఫిలడెల్ఫియా మాల్ సమీపంలో మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.జనసాంద్రత గల ప్రాంతంలో కూలిన ఈ విమానం ఒక ‘ఎయిర్ అంబులెన్స్’.ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 19 మంది గాయపడ్డారు.
విమానం కూలడంతో పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి.మృతుల్లో ఒక అమ్మాయి, ఆమె తల్లి, మరో నలుగురు వ్యక్తులు ఉన్నారని వీరంతా మెక్సికో వాసులుగా గుర్తించారు అధికారులు.
దీనితో విమాన ప్రయాణ సురక్షితతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి.







