సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(Casting Cauch)ఉందన్న విషయం అందరికీ తెలిసిందే ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారికి అవకాశాలు రావాలి అంటే తప్పనిసరిగా కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు.ఒక ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు అన్ని రంగాలలో కూడా మహిళలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఇది కాస్త ఎక్కువగా అని చెప్పాలి.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా యాంకర్, నటి అనసూయ భరద్వాజ (Anasuya Bhardwaj) సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టారు.ఇటీవల ఈమె ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఇండస్ట్రీలో తనుకు ఎదురైనా చేదు అనుభవాల గురించి అందరితో పంచుకున్నారు.ఇండస్ట్రీలోకి వచ్చేవారు తప్పనిసరిగా దర్శక నిర్మాతలకు కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని అలా ఇస్తేనే అవకాశాలు వస్తాయని తెలిపారు.

తనకి కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఛాన్స్ కావాలంటే పక్కలోకి రమ్మని ఒక స్టార్ హీరో అలాగే దర్శక నిర్మాతలు కూడా అడిగారు కానీ నేను మాత్రం నో అనే సమాధానం చెప్పాను.ఆ సమయంలో పూర్తిగా సినిమా అవకాశాలు కూడా తనకు లేకుండా పోయాయని అనసూయ వెల్లడించారు.ఇండస్ట్రీ లోకి వచ్చే అమ్మాయిల విషయంలో దర్శక నిర్మాతలు కానీ హీరోలు కానీ కమిట్మెంట్స్ కాకుండా వారిలో కళా నైపుణ్యాన్ని గుర్తించి అవకాశాలు ఇస్తే ఇండస్ట్రీలోకి ఎంతోమంది అమ్మాయిలు అడుగు పెడతారని అనసూయ తెలిపారు.తనకు స్కూల్ డేస్ లోనే ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి.
ఆ సమయంలోనే నేను రిజెక్ట్ చేసాను అలాగే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా కమిట్మెంట్స్ అడిగారు అప్పుడు కూడా నో చెప్పాను అంటూ అనసూయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.