తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) కమర్షియల్ డైరెక్టర్ల సంఖ్య ఎక్కువైపోతుంది.ఇప్పటికే గోపీచంద్ మలినేని, బాబి, అనిల్ రావిపూడి ( Gopichand Malineni, Babi, Anil Ravipudi )లాంటి దర్శకులు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక వీళ్ళతో పాటుగా ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న త్రినాధ్ రావు నక్కిన కూడా కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరుతో సంపాదించుకున్నాడు.ఇక మిగతా దర్శకుల్లో కొంతవరకు కొత్తగా ఉంటున్నట్టు అనిపించినప్పటికి త్రినాధ్ రావు నక్కిన( Trinadh Rao ) సినిమాలో మాత్రం ఎలాంటి కొత్తధనం అయితే ఉండదు.
అదే రొటీన్ రొట్ట ఫార్ములాను తీసుకొని అవే హీరోయిన్స్ తో నడిపిస్తూ ఉంటాడు.ఇక తండేల్ సినిమాలో ఎమోషన్స్ ను చూపించినట్టుగానే మామ అల్లుళ్ళ మధ్య రైవల్టీ సన్నివేశాలను చూపించి సినిమాని హిట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంటాడు.
ఇక తన ఆస్థాన రచయిత అయిన బెజవాడ ప్రసన్నకుమార్ రైటింగ్ అయితే పరమ చెత్తగా ఉంటుంది.
ఆయన ప్రతి సినిమాని ఒకేవేళ రాస్తూ ఉంటాడు.
అందువల్లే ఆయన సినిమాకు సంబంధించిన కథను అందిస్తున్నాడు అనగానే ప్రతి ఒక్కరు సినిమా మీద డిసప్పాయింట్ అవుతున్నారనే చెప్పాలి.ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాల్లో రొటీన్ ఫార్ములాలను ఫాలో అవుతూ సినిమాలు చేసినవే కావడం విశేషం…మరి ఇకమీదటైనా ఆయన మారి మంచి స్టోరీలు రాసి ఇస్తే త్రినాధ్ రావు నక్కిన మంచి సినిమాలను చేస్తానని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.