తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhi Agarwal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది నిధి అగర్వాల్.సినీమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తొలి సినిమా కోసం నేను కూడా చాలా కష్టాలు పడ్డాను.

దాదాపు రెండేళ్ల పాటు ఆఫీసుల చుట్టు తిరిగితే కానీ అవకాశం రాలే రాలేదు అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.నేను సినిమాల్లోకి రావడానికి కారణం దీపికా పదుకొణె( Deepika Padukone ).ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చాను.తెరపై దీపికను చూసి నేను కూడా హీరోయిన్ అవుతానని ఇంట్లో చెప్పాను.మొదట్లో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు.ముందు చదువు పూర్తి చెయ్, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు.కొన్నాళ్ల తర్వాత సినిమాలపై నాకున్న పిచ్చి చూసి మా నాన్నగారే ప్రోత్సహించారు.

హీరోయిన్ గా ట్రై చెయ్ అని చెప్పారు.అలా ఇంట్లో వాళ్ల అనుమతితో ఇండస్ట్రీలోకి వచ్చాను.సినిమా చాన్స్‌లు ఈజీగా వస్తాయని అందరూ అనుకుంటారు.కానీ ఒక్క చాన్స్ రావడం అంత ఈజీ కాదు.నేను అయితే దాదాపు రెండేళ్ల పాటు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగాను.ఎవరూ అవకాశం ఇవ్వలేదు.
కొంతమంది దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారు.రెండు మూడు సార్లు ఆఫీసుల చుట్టు తిప్పించుకొని ఆ తర్వాత మీకు అవకాశం లేదని బయటకు పంపించేశారు.
చివరిగా మైఖేల్ మున్నా సినిమా ఆడిషన్ కి వెళ్తే అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను.దాదాపు 300 మందిని ఆడిషన్ చేయగా అదృష్టం కొద్ది నేను సెలెక్ట్ అయ్యాడు.
ఆ సినిమా చూసి నాకు నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో చాన్స్ వచ్చింది అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే.
ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోంది.







