ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు రెండు నుంచి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం సాధారణంగా జరుగుతుంది.సంక్రాంతి పండుగకు (Sankranti festival)విడుదలైన సినిమాలు యావరేజ్ టాక్ తో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మూడు సినిమాలలో రెండు సినిమాలు హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
2026 సంవత్సరం(2026 year) సంక్రాంతి కానుకగా ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ డ్రాగన్ (NTR Prashanth Neel combo movie Dragon)ఫిక్స్ అయింది.అయితే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో (Chiranjeevi Anil Ravipudi combo)మూవీ కూడా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.2026 సంవత్సరం సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కన్నేయడం నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.

చిరంజీవి, ఎన్టీఆర్(chiranjeevi , Jr ntr ) బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఈ ఇద్దరు హీరోలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.డ్రాగన్, చిరు అనిల్ కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.మెగా నందమూరి హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన ప్రతి సందర్భంలో సంచలనం అవుతుంది.

అటు చిరంజీవి ఇటు ఎన్టీఆర్ పారితోషికాలు దాదాపుగా ఈక్వల్ గా ఉన్నాయని తెలుస్తోంది.అటు అనిల్ రావిపూడి ఇటు ప్రశాంత్ నీల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు కాగా ఈ డైరెక్టర్లు తమ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.2026 సంవత్సరం సంక్రాంతి సినిమాల జాబితాలో మరికొన్ని సినిమాలు చేరే ఛాన్స్ అయితే ఉంది.చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.ఈ హీరోల రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







