సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్ర లేచే సమయానికి కడుపులో ఎలుకలు పరుగులు పెడుతుంటారు.ఆ ఆకలి మీద ఏది పడితే అది కడుపులోకి తోసేస్తుంటారు.
కానీ ఖాళీ కడుపుతో( Empty Stomach ) కొన్ని కొన్ని ఆహారాలు తినడం చాలా డేంజర్.చెడు ఆహార ఎంపికలు ప్రధానంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.
ఈ నేపథ్యంలోనే ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ.
( Coffee ) మనలో ఎక్కువ శాతం మంది ఖాళీ కడుపుతో తీసుకునే పానీయం ఇది.కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం జీర్ణాశయంలో ఆమ్లాలు పెరుగుతాయి.ఇది గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలకు కారణమవుతుంది.అలాగే ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాల్లో అరటి పండు( Banana ) ఒకటి.అరటి పండులో మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది.అందువల్ల ఖాళీ కడుపుతో అరటి పండు తింటే రక్తంలోని మెగ్నీషియం లెవల్స్ బాగా పెరిగి గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు.
ఖాళీ కడుపులో పెరుగు( Curd ) తినకూడదు.పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులోని హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో కలిసి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.సైట్రస్ పండ్లను( Citrus Fruits ) కూడా ఖాళీ కడుపుతో తినకూడదు.
ఎందుకంటే ఇవి జీర్ణాశయానికి ఇబ్బంది కలిగిస్తాయి.ఇవే కాకుండా కీరదోసకాయ, టమాటో, స్పైసీ ఫుడ్స్, సోడా మరియు కార్బొనేటెడ్ డ్రింక్స్ ను ఎమ్టీ స్టమక్ తో తీసుకోకూడదు.
ఇవి పేగుల్లో మంట లేదా అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది.
ఇక ఖాళీ కడుపులో గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి తీసుకోవచ్చు.ఫైబర్ పుష్పలంగా ఓట్స్ తినొచ్చు.బాదం, వాల్‌నట్స్, ఖర్జూరం, అంజీర్ వంటి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్చు.
టీ, కాఫీలకు బదులుగా పాలు తీసుకోవచ్చు.ఇవి శరీరానికి శక్తి మరియు పోషకాలను అందిస్తాయి.
వీటిని ఖాళీ కడుపులో తీసుకోవడం అత్యంత ఆరోగ్యకరం.