విదేశాల్లో షాపింగ్ చేసేటప్పుడు మనకు ఇష్టమైన పాట వినబడితే ఎలా ఉంటుంది? అంటే మన మాతృభాష పాట వింటే ఏమనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా.సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది ఓ భారతీయ జంటకు.
చైనా( China ) వీధుల్లో తిరుగుతుండగా, ఓ సూపర్ మార్కెట్‌లో కన్నడ పాట( Kannada Song ) విని ఆశ్చర్యపోయారు.డాక్టర్ రాజ్‌కుమార్( Dr Rajkumar ) నటించిన గంధద గుడి సినిమాలోని ‘నావడువ నుడియే’( Naavaduva Nudiye Song ) పాట అక్కడ ప్లే అవుతోంది.
ఈ ఊహించని సంఘటనతో సదరు ఎన్నారై కపుల్ ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.వెంటనే ఆ క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ట్విట్టర్‌లో ప్రవీణ్ ఆర్ అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.వీడియోలో సూపర్ మార్కెట్ బయట చైనీస్ అక్షరాలు కనిపిస్తున్నాయి.బ్యాక్‌గ్రౌండ్‌లో కన్నడ హిట్ సాంగ్ మనం వినవచ్చు.కెమెరా వెనుకున్న వ్యక్తి ఆనందంతో వీడియో తీస్తుంటే, అతనితో ఉన్న మహిళ సైతం చాలా సంతోషంగా కనిపిస్తోంది.ఇంత దూరం వచ్చి తమ అభిమాన పాట వినడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వాళ్లు చెప్పుకొచ్చారు.
పాటలోని “అహహహ” అనే ఐకానిక్ మ్యూజిక్ వినిపించినప్పుడు ఈ జంట వీడియో రికార్డ్ చేయడం మొదలెట్టారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.డా.
రాజ్‌కుమార్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు.కామెంట్ల రూపంలో తమ ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ హార్ట్ ఎమోజీలతో ముంచెత్తారు.
చైనా సూపర్ మార్కెట్‌లో కన్నడ క్లాసిక్ వినడం అనేది నిజంగా ఒక అరుదైన సంఘటన.సంగీతానికి భాషా బేధం లేదని, ప్రపంచవ్యాప్తంగా దానికున్న ఆదరణకు ఇది ఒక ఉదాహరణ.
ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా సర్‌ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారు.దీన్ని మీరు కూడా చూసేయండి.