సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్ర లేచే సమయానికి కడుపులో ఎలుకలు పరుగులు పెడుతుంటారు.
ఆ ఆకలి మీద ఏది పడితే అది కడుపులోకి తోసేస్తుంటారు.కానీ ఖాళీ కడుపుతో( Empty Stomach ) కొన్ని కొన్ని ఆహారాలు తినడం చాలా డేంజర్.
చెడు ఆహార ఎంపికలు ప్రధానంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.ఈ నేపథ్యంలోనే ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ.( Coffee ) మనలో ఎక్కువ శాతం మంది ఖాళీ కడుపుతో తీసుకునే పానీయం ఇది.
కానీ ఖాళీ కడుపుతో కాఫీ తాగడం జీర్ణాశయంలో ఆమ్లాలు పెరుగుతాయి.ఇది గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలకు కారణమవుతుంది.
అలాగే ఖాళీ కడుపుతో తినకూడని ఆహారాల్లో అరటి పండు( Banana ) ఒకటి.
అరటి పండులో మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది.అందువల్ల ఖాళీ కడుపుతో అరటి పండు తింటే రక్తంలోని మెగ్నీషియం లెవల్స్ బాగా పెరిగి గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు.