పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!

ఆడవారిని ప్రతి నెల పలకరించే అజాతశత్రువు పీరియడ్స్.( Periods ) కొందరికి పీరియడ్స్ చాలా సులభంగా అయిపోతుంది.కానీ కొందరిని మాత్రం ఎంతో బాధాకరంగా ఉంటుంది.పీరియడ్స్ లో కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, ఇతర ఒంటి నొప్పులతో అల్లాడిపోతూ ఉంటారు.భరించలేనంత బాధను అనుభవిస్తుంటారు.ఈ క్రమంలోనే నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు.

 This Drink Helps To Get Rid Of Period Pain Details, Period Pain, Period Cramps,-TeluguStop.com

అయితే సహజంగా కూడా పీరియడ్స్ లో వేధించే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా ఈ డ్రింక్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం నెలసరి నొప్పులను దూరం చేసే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Cardamom, Cinnamon, Fennel Seeds, Tips, Herbal, Latest, Mint, Period Cram

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో 8 నుంచి 10 వరకు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు,( Fennel Seeds ) రెండు మెత్తగా దంచిన యాలకులు,( Cardamom ) రెండు లవంగాలు( Cloves ) మరియు అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మరిగించాలి.దాదాపు పది నిమిషాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Cardamom, Cinnamon, Fennel Seeds, Tips, Herbal, Latest, Mint, Period Cram

ఈ వాటర్ ను గోరువెచ్చగా అయిన తరువాత సేవించాలి.నెలసరి సమయంలో ఈ డ్రింక్ మంచి పెయిన్ రిలీఫర్ గా పనిచేస్తుంది.కడుపునొప్పి, నడుం నొప్పి మరియు ఇతర ఒంటి నొప్పులను ఈ డ్రింక్‌ సమర్థవంతంగా దూరం చేస్తుంది.మూడ్‌ స్వింగ్స్ ను తగ్గిస్తుంది.మైండ్ ను రిలాక్స్ గా మారుస్తుంది కడుపులో అసౌకర్యం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టడంలోనూ ఈ డ్రింక్ తోడ్పడుతుంది.కాబట్టి పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నామని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube