పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!
TeluguStop.com
ఆడవారిని ప్రతి నెల పలకరించే అజాతశత్రువు పీరియడ్స్.( Periods ) కొందరికి పీరియడ్స్ చాలా సులభంగా అయిపోతుంది.
కానీ కొందరిని మాత్రం ఎంతో బాధాకరంగా ఉంటుంది.పీరియడ్స్ లో కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, ఇతర ఒంటి నొప్పులతో అల్లాడిపోతూ ఉంటారు.
భరించలేనంత బాధను అనుభవిస్తుంటారు.ఈ క్రమంలోనే నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు.
అయితే సహజంగా కూడా పీరియడ్స్ లో వేధించే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ డ్రింక్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
మరి ఇంకెందుకు ఆలస్యం నెలసరి నొప్పులను దూరం చేసే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
"""/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అందులో 8 నుంచి 10 వరకు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు,( Fennel Seeds ) రెండు మెత్తగా దంచిన యాలకులు,( Cardamom ) రెండు లవంగాలు( Cloves ) మరియు అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మరిగించాలి.
దాదాపు పది నిమిషాలు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
"""/" /
ఈ వాటర్ ను గోరువెచ్చగా అయిన తరువాత సేవించాలి.నెలసరి సమయంలో ఈ డ్రింక్ మంచి పెయిన్ రిలీఫర్ గా పనిచేస్తుంది.
కడుపునొప్పి, నడుం నొప్పి మరియు ఇతర ఒంటి నొప్పులను ఈ డ్రింక్ సమర్థవంతంగా దూరం చేస్తుంది.
మూడ్ స్వింగ్స్ ను తగ్గిస్తుంది.మైండ్ ను రిలాక్స్ గా మారుస్తుంది కడుపులో అసౌకర్యం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టడంలోనూ ఈ డ్రింక్ తోడ్పడుతుంది.
కాబట్టి పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నామని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను ప్రయత్నించండి.
అలాంటి కాన్సెప్ట్ తో మహేష్ జక్కన్న మూవీ.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేదుగా!