సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) మూవీ వీక్ డేస్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాభాలతో గేమ్ ఛేంజర్( Game Changer ) నష్టాలు భర్తీ అయినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ సెకండ్ వీకెండ్ కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంది.వెంకటేశ్,( Venkatesh ) మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తమ నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారు.
అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.స్టార్ హీరో వెంకటేశ్ రేంజ్ ఏంటో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ 2025 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది.పాన్ ఇండియా మూవీ కాకపోయినా ఆ సినిమాలను మించి సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం కొసమెరుపు.సంక్రాంతికి వస్తున్నాం మూవీ కేవలం 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ5, జీ తెలుగు సొంతం చేసుకోవడం గమనార్హం.సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి.సంక్రాంతికి వస్తున్నాం సినిమా సరికొత్త కథనంతో తెరకెక్కడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు కొనసాగుతున్నాయి.
వెంకటేశ్ సినీ కెరీర్ ఈ సినిమాతో పుంజుకోవడం పక్కా అని చెప్పవచ్చు.