నందమూరి నట సింహం బాలకృష్ణ( Balakrishna ) తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డాకు మహారాజ్( Daaku Maharaaj ) అనే సినిమా ద్వారా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.డైరెక్టర్ బాబి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ తో పాటు ఊర్వశి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు.అద్భుతమైన కథతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్( Shraddha Srinath ) మాట్లాడుతూ.ఈ సినిమాని ఇంత మంచి విజయం చేసిన అభిమానులకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే బాలకృష్ణ గారితో ఈ సినిమాలో నటించడం నిజంగా తనకు దక్కిన గౌరవం అని తెలిపారు.
బాలకృష్ణ గారు ఒక మాస్ ఐకాన్, ఒక లెజెండ్ అని తెలిపారు.ఇక డైరెక్టర్ పై కూడా ఈమె ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి ఊర్వశి( Urvashi Rautela ) సైతం మాట్లాడుతూ…డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.బాబీ గారు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప స్టోరీ టెల్లర్.లో ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు.ఇక బాలకృష్ణ గారి లాంటి ఒక లెజెండ్ తో నటించడం నిజంగా నా అదృష్టం ఆయన ఎన్టీఆర్( NTR ) నట వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అంటూ బాలకృష్ణపై ఊర్వశి ప్రశంశల వర్షం కురిపించింది.
ఇక ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అలాగే దర్శకుడు పై కూడా ఈమె ప్రశంసలు కురిపించారు.ఈ సినిమాకు నిర్మాత నాగ వంశీ బ్యాక్ బోన్ గా నిలిచారని తెలిపారు.