బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై ఎన్ఆర్ఐల ఇంట్రెస్ట్ .. ఎందుకిలా?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడే స్థిరపడుతున్నారు.అయితే రిటైర్‌మెంట్ తర్వాత మాత్రం మాతృదేశంలోనే , అయినవారు , ఆత్మీయుల మధ్యే ఉండాలని కోరుకుంటున్నారు.

 Why Us-based Nris Prefer To Invest In Bengaluru Details, Us-based Nris, Invest-TeluguStop.com

ఇందుకోసం భారత్‌లోనే కోట్లాది రూపాయలు వెచ్చించి మరి ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు.ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతలు, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండే నగరాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఎన్ఆర్ఐలు( NRI’s ) ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ లిస్ట్‌లో కర్ణాటక రాజధాని, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు( Bengaluru ) దూసుకెళ్తోంది.అమెరికాలో స్థిరపడిన ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు బెంగళూరులో ఆస్తులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో నగరంలోని నార్త్ బెంగళూరు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.వైట్‌ఫీల్డ్, ఐటీ కారిడార్‌లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నిండిపోయాయని రియల్ ఎస్టేట్( Real Estate ) నిపుణులు చెబుతున్నారు.

Telugu Bengaluru, Nri Estate, Nrisinvest, Nris-Telugu NRI

NoBroker.com నిర్వహించిన సర్వే ప్రకారం.ఎన్ఆర్ఐలకు నార్త్ బెంగళూరు( North Bengaluru ) అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా ఉందన్నారు.దాదాపు 39.7 శాతం మంది ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టారు.దీని తర్వాత తూర్పు బెంగళూరులో 37.7 శాతం మంది, సౌత్ బెంగళూరులో 18.1 శాతం మంది, పశ్చిమ బెంగళూరులో 3.9 శాతం మంది, సెంట్రల్ బెంగళూరులో 0.5 శాతం మంది పెట్టుబడులు పెట్టినట్లుగా తేలింది.

Telugu Bengaluru, Nri Estate, Nrisinvest, Nris-Telugu NRI

నార్త్ బెంగళూరు రెండు దశాబ్ధాల క్రితం ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఉండేది.కాలక్రమంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, మాన్యత టెక్ పార్క్ అభివృద్ధి, హెబ్బాల్, హెన్నూర్, యలహంక, దేవనహళ్లి వంటి ప్రాంతాలు కూడా పుంజుకోవడంతో ఎన్ఆర్ఐలు ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తున్నారు.దీనికి తోడు అమెజాన్ ఇండియా, ఎస్ఏపీ ల్యాబ్స్, విప్రో వంటి బహుళజాతి సంస్థలు నార్త్ బెంగళూరులో క్యాంపస్‌లను లీజుకు తీసుకోవడం గానీ కొత్తగా నిర్మించడం గానీ చేస్తుండటంతో యూఎస్‌లో స్దిరపడిన ఎన్ఆర్ఐలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఎన్ఆర్ఐలు ఎక్కువగా లగ్జరీ విల్లాలను కొనడానికి ఇష్టపడుతున్నారు.3 వేల నుంచి 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని విల్లాను కొనుగోలు చేసేందుకు రూ.10 కోట్లు సైతం ఖర్చు చేసేందుకు ఎన్ఆర్ఐలు వెనుకాడటం లేదని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube