రోజు రోజుకు విదేశాల్లో స్థిరపడుతున్న ప్రవాస భారతీయుల సంఖ్య పెరుగుతున్నందున భారత పార్లమెంట్‌లో( Indian Parliament ) వారికి ప్రాతినిథ్యం ఉండాలని పలువురు నిపుణులు గతంలో సూచించారు.తాజాగా ఇదే అంశంపై కీలక ముందడుగు పడింది.
మంగళవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ ఆన్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్( Parliamentary Committee on External Affairs ) సమావేశంలో పార్లమెంట్‌లో వారికి ప్రాతినిథ్యం కల్పించాలని సిఫారసు చేశారు.విదేశాలలో నివసిస్తున్న పౌరులకు ఇటలీ వంటి దేశాలు తమ పార్లమెంట్‌లో రిజర్వేషన్లను అమలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా( Congress MP Deepender Singh Hooda ) ఉదహరించారు.
వారి సమస్యలను మెరుగైన రీతిలో పరిష్కరించుకోవడానికి పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐల( NRI’s ) ప్రాతినిథ్యం ఉండాలని హుడా ప్రతిపాదించారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్( Congress MP Shashi Tharoor ) నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ .ప్రవాస భారతీయులకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించింది.ఈ సమావేశం తర్వాత శశిథరూర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.
ప్రవాసులతో కలిసి పనిచేస్తున్న నాలుగు సంస్థలతో తాము వివరణాత్మకమైన, సమగ్రమైన చర్చలు జరిపామని తెలిపారు.సమావేశం చాలా బాగా జరిగిందని శశిథరూర్ పేర్కొన్నారు.
ఈ బిల్లు తయారీ, చర్చల దశలో ఉందని పార్లమెంటరీ ప్యానెల్‌కు సంబంధిత మంత్రిత్వ శాఖ తెలియజేసిందని ఆయన తెలిపారు.ఈ విషయంలో తమ అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయని శశిథరూర్ చెప్పారు.
ఇది నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలను క్రమబద్ధీకరిస్తుందని.అవాంఛనీయమైన కార్యకలాపాలను అరికడుతుందని ఓ ఎంపీ తెలిపారు.కొన్నిసార్లు చట్టవిరుద్ధంగా విదేశీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రజలు చేసే తీవ్ర ప్రయత్నాలు కూడా ఇందులో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి కేరళకు చెందిన నార్కా రూట్స్, పంజాబ్ ప్రభుత్వ ఎన్ఆర్ఐ వ్యవహారాల విభాగం, ఢిల్లీలోని పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ , గుజరాత్‌కు చెందిన సెంటర్ ఫర్ డయాస్పోరా స్టడీస్‌లకు చెందిన ప్రతినిథులు హాజరయ్యారు.
ఈ భేటీలో పాల్గొన్న కొన్ని సంస్థలు.పలు ప్రతిపాదనలు చేశాయని ఆయా వర్గాలు తెలిపాయి.