మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) తాజాగా గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా తెచ్చుకుంది.
ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తుందని అభిమానులు కూడా ఆశపడ్డారు.కానీ అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి.
ఈ సినిమాతో సరైన సక్సెస్ సాధించలేకపోయిన రాంచరణ్ తదుపరి సినిమాతో ఎలా అయినా మంచి సక్సెస్ ను సాధించాలని చూస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం అదిరిపోయే లైనప్ కూడా ఉంది.
రామ్ చరణ్ తన 16వ సినిమానే బుచ్చిబాబు( Buchi Babu ) దర్శకత్వంలో చేస్తుండగా తన 17వ సినిమా అని సుకుమార్( Sukumar ) తో చేయబోతున్నారట.
ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ రెండు చిత్రాలలో ముందుగా రానున్న RC16 సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రానున్న మూవీ, స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచి ఉన్న ప్రచారాలు నడుస్తున్న విషయం తెలిసిందే.
దీంతో ఈ సినిమా ఏ ఆట నేపథ్యంలో తెరకెక్కుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.అలాగే కబడ్డీ( Kabaddi ) ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని కూడా ఒక ప్రచారం కూడా జరిగింది.అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఇది కేవలం ఒక గేమ్ నేపథ్యంలో నడిచే కథ కాదట.RC16 అనేది మల్టీ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందట.
ఇందులో కబడ్డీ, కుస్తీ, క్రికెట్ తో పాటు పలు స్పోర్ట్స్ ను టచ్ చేస్తూ కథ నడుస్తుందట.అయితే ఈ సినిమాలో పలు స్పోర్ట్స్ ప్రస్తావన ఉన్నప్పటికీ, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా గ్రామీణ నేపథ్యంలో బలమైన ఎమోషన్స్ తో దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు తెలుస్తోంది.RC16 సినిమాలో రామ్ చరణ్ పాత్ర కొత్తగా ఉంటుందని సమాచారం.రంగస్థలం సినిమా లెవెల్ లో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారని అంతటి గుర్తింపు రాంచరణ్ కి దక్కుతుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో శివన్న, కుస్తీ మాస్టర్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం.