ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నిర్మాతలపై ఐటి దాడులు( IT Raids ) జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ప్రముఖ నిర్మాణ సంస్థలపై ఐటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఐటి దాడుల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్( Venkatesh ) హీరోగా దిల్ రాజు( Dil Raju ) నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మూడు సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఒక విలేకరి నుంచి అనిల్ రావిపూడికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది మీ సినిమా నిర్మాత ఐటీ దాడులను ఎదుర్కొంటూ బాధపడుతున్నప్పటికీ మీరు మాత్రం ఇలా సక్సెస్ మీట్ నిర్వహించడానికి కారణమేంటంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ…
మేము మా సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టాము కదా అందుకే ఐటీ వాళ్లు కూడా సంక్రాంతికే వచ్చారని తెలిపారు.సినిమా ఇండస్ట్రీ పై ఇలా ఐటీ దాడులు జరగడం సర్వసాధారణం.ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఇలా ఐటి అధికారులు సోదాలు చేస్తుంటారని అనిల్ రావిపూడి తెలిపారు.ఇక మా నిర్మాత దిల్ రాజు గారిపై ఐటి దాడులు జరుగుతుంటే ఆయన ఏమాత్రం బాధపడలేదు తన నిర్మాణ సంస్థపై మాత్రమే దాడి జరగలేదు కనుక ఆయన మన సినిమా ప్రమోషన్లను మీరు మాత్రం ఆపద్దు నేనొక్కడినే రాకపోయినా పర్వాలేదు ఈ విషయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోవాలి అంటూ చెప్పడంతోనే ఈ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
సుకుమార్ గారి ఇంటి పై కూడా ఐటి దాడులు జరిగాయి మరి మీ ఇంటిపై కూడా జరుగుతాయ అంటూ మరొక విలేకరి ప్రశ్నించడంతో నేను సుకుమార్ గారి ఇంటి పక్కన లేను ఫిబ్రవరిలో వారి ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతాను.ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మా ఇంటికి కూడా రావచ్చేమో అంటూ అనిల్ రావిపూడి సరదాగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.