టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్( Game changer ).శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.విడుదలైన మొదటి షోకే నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు చాలా వరకు సినిమా థియేటర్ కు వెళ్లడం కూడా మానేశారు.
మౌత్ టాక్ ఎక్కువగా నెగిటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే.అలాగే రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్డి పైరసీ లీక్ కావడం, దాన్ని ఏకంగా సోషల్ మీడియాతో పాటు బయట పబ్లిక్ ప్లేసుల్లో స్క్రీనింగ్ చేయడం లాంటివి చూసి ఫ్యాన్స్ నివ్వెరపోయారు.

ఇలా ఈ సినిమాకు చాలా నెగిటివ్ ప్రచారం కొనసాగింది.అయితే దీని వెనుక నలభై అయిదు మంది ఉన్నారని గుర్తించిన ఎస్విసి బృందం( SVC team ) ఆ మేరకు పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరిగిపోయాయి.ఇవన్నీ డిజాస్టర్ ఫలితాన్ని మార్చవు కానీ భవిష్యత్తులో ఇతర ప్యాన్ ఇండియా చిత్రాలకు ఒక అలెర్ట్ గా పనికొస్తుంది.అయితే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనుకుంటే ఈ సినిమా థియేటర్లలో ఇంకా ఉండగానే తాజాగా 4k ప్రింట్ బయటికి రావడం ఇప్పుడు అభిమానులను మరోసారి ఆశ్చర్యపరుస్తోంది.
సినిమా విడుదలైన 14 రోజులకే ఇలా జరగడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.అది కూడా స్పష్టమైన ఆడియో వీడియోతో ప్రత్యక్షం కావడంతో నివ్వెర పోతున్నారు.

దీని వెనుక ఎవరు ఉన్నారనేది తర్వాత తేలుతుంది కానీ రాను రాను హెచ్డి పైరసీ వెర్రి తలలు వేయడం పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదు.పుష్ప 2 ది రూల్, మార్కో, సూక్ష్మ దర్శిని, బరోజ్, కంగువ లాంటివి ఓటిటి కన్నా ముందే దీని బారిన పడి నష్టాలను చవి చూశాయి.థియేటర్ ప్రింట్లు పైరసీ కావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇలా హెచ్డిల రూపం చాలా ప్రమాదరకమైన పరిణామం.ఇప్పుడు కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇతర నిర్మాతలు ఈ మహమ్మారి బారిన పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
ప్రభుత్వాలు, పరిశ్రమ సమన్వయంతో పని చేస్తే తప్ప పరిష్కారం దొరకడం కష్టం.జరగండి జరగండి పాట నుంచి గేమ్ ఛేంజర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి.ఆఖరికి విడుదలయ్యాక కూడా అదే రిపీట్ కావడం విషాదం.బాక్సాఫీస్ రన్ పూర్తి కావడానికి దగ్గరగా ఉన్న తరుణంలో గేమ్ చేంజర్ మీద మరో పిడుగు పడటం గోరుచుట్టు మీద రోకలిపోటు లాగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.