సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా మానవ సంబంధాలను ప్రశ్నించేలా చేస్తోంది.మృతుడి కుటుంబంలో జరిగిన బాధాకర సంఘటనలో, సొంత సోదరుడి మరణానంతరం అతని మృతదేహం పక్కనే ఓ చెల్లెలు రీల్ వీడియో( sister reel video ) తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం అందరిని షాక్‌కు గురిచేసింది.
ఈ సంఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో, చనిపోయిన సోదరుడి భార్య బిగ్గరగా ఏడుస్తుండగా.చెల్లెలు రీల్ షూట్ చేస్తూ, స్థానిక భాషలో ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది.“పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు.ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు,” అంటూ ఆమె చెప్పిన మాటలు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.ఈ వీడియో చూసిన వారంతా ఆమె చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ ఘటనపై సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనేకమంది ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మరణాన్ని కూడా రీల్స్ కోసం వాడుకోవడం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు, సోషల్ మీడియా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇది చాటిచెబుతోందని పేర్కొన్నారు.ఈ సంఘటన సోషల్ మీడియా ప్రభావంపై ప్రశ్నలను కలిగిస్తోంది.రీల్స్, షార్ట్ వీడియోల( Reels, short videos ) కోసం ఆలోచించకుండా చేస్తున్న చర్యలు మానవత్వాన్ని మరిచిపోవడానికి దారితీస్తున్నాయి.
సోదరుడి మరణం వంటి విషాదాన్ని కూడా ఇలా వినియోగించడం బాధాకరం.ఈ ఘటన నైతికతపై, మానవ సంబంధాలపై కొత్తగా ఆలోచించేలా చేస్తోంది.సంతోషకరమైన జ్ఞాపకాలను పంచుకోవడానికే సోషల్ మీడియా వేదిక కావాలి గాని, బాధ సంఘటనలను ఇలా ప్రదర్శించడం సమాజంలో మానవత్వాన్ని కించపరుస్తుందని స్పష్టంగా చెబుతుంది.