దయచేసి నిజాయితీతో ఉండండి... సంచలనంగా మారిన సమంత పోస్ట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత( Samantha ) ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.ఈమె చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Samantha Latest Social Media Post Goes Viral Details, Samantha, Thanks, Citadel,-TeluguStop.com

ఈ సినిమా తర్వాత సమంత మయోసైటిస్( Myositis ) అనే వ్యాధి బారిన పడ్డారు.అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ఇప్పటివరకు తిరిగి ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఇలా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

Telugu Citadel, Samantha, Khushi, Myositis, Samantha Diary, Samantha Offers-Movi

తాజాగా సమంత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.నేను గత రెండు సంవత్సరాలుగా ఈ చిన్న ఆచారాన్ని అభ్యసిస్తున్నాను.ఇది నా కష్టతరమైన క్షణాలలో చాలా ఉపయోగపడింది.

ఇది చాలా సులవైనది అలాగే శక్తివంతమైనదని తెలిపారు.మీకు రాయడం కనుక వచ్చినట్లయితే ప్రతిరోజు డైరీలో ఆరోజు ఎవరికి మీరు థాంక్స్ చెప్పాలి ఎందుకు చెప్పాలి అనే విషయాలను కచ్చితంగా రాయమని తెలిపారు.

Telugu Citadel, Samantha, Khushi, Myositis, Samantha Diary, Samantha Offers-Movi

ఇలా మీరు ఎవరికైనా థాంక్స్( Thanks ) చెప్పాలి అనుకున్నారో వారి గురించి పెద్దగా రాయాల్సిన అవసరం లేదు కేవలం నిజాయితీతో రాస్తే చాలు.మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి రాసి చూడండి అదే అలవాటు అయిపోతుంది.ఒకసారి అందరూ దీన్ని ట్రై చేయండి.మనలో చాలా మార్పులు వస్తాయి ఇది నాకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు.నా జీవితంలో ఇదే నాకు ఒక గేమ్ ఛేంజర్ గా మారిపోయింది అంటూ ఈ సందర్భంగా సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక సమంత చాలా గ్యాప్ తర్వాత సిటాడెల్( Citadel ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారే తప్ప ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయలేదని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube